29.7 C
Hyderabad
May 3, 2024 03: 19 AM
Slider నిజామాబాద్

మోర్తాడ్ ప్రభుత్వాసుపత్రిలో తొలి ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్

#ministerprashantreddy

కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని రాష్ట్ర రోడ్లుభవనాలు, గృహనిర్మాణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎంతో బాధ కలిగించిందని ఆయన అన్నారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ను బుధవారం రోజున ఆయన ప్రారంభించారు. మిత్రుల సహకారంతో రూ. కోటి ఖర్చుతో ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు, 14 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేశారు.12 ప్రభుత్వ హాస్పిటల్స్ లో RO ప్లాంట్స్, రిసెప్షన్ ఏరియా, ఇతర సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. దీంతో పాటు ఆర్మూర్, బోధన్ ఆసుపత్రుల్లో 10 ఐ సి యూ బెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు.

మిత్రుల సహకారంతో వెంటనే రూ. కోటి సమకూర్చి చెక్కును కలెక్టర్ కు అందజేశానని మంత్రి తెలిపారు. పనులు వెంటనే చేపట్టి మూడో వేవ్ కరోన ఎదుర్కొనేందుకు సిద్ధం చేశామని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కోట్లు సంపాదించిన కూడా కలగని ఆనందం ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న సందర్బంగా కలిగింది. రోజుకు 50 ఆక్సిజన్ సిలెండర్ లు నింపుకుని సమర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో మోర్తాడ్ నుండి నియోజకవర్గం లోని ఇతర హాస్పిటల్స్ కి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసే విధంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు సిద్ధమయ్యాయి.

ఆసుపత్రుల్లో మంచి వాతావరణాన్ని ఏర్పరచాలని వైద్యులకు, సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కరోనా మళ్ళీ వచ్చినా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆక్సిజన్ అందక, బెడ్స్ లేకుండా ఒక్కరు చనిపోవడానికి వీల్లేదని సంకల్పం తీసుకున్నాను. పూర్తిస్థాయి చికిత్స అందిన తర్వాత ఇకపై దేవుడిపై భారం వేద్దాం అని ఆయన అన్నారు.

Related posts

తెలంగాణ లో అనుమతిలేని కాలేజీల మూసివేత

Satyam NEWS

చట్టం ఉల్లంఘిస్తే పోలీసులు బోనులో నిలబడాల్సి వస్తుంది

Satyam NEWS

ఘ‌నంగా ఇందిరాగాంధీ 103వ జ‌యంతి

Sub Editor

Leave a Comment