42.2 C
Hyderabad
April 26, 2024 18: 52 PM
Slider ప్రత్యేకం

బూతు…. బూతు…: రేవంత్ రెడ్డిపై తొడగొట్టి బూతులు మాట్లాడిన మంత్రి

#ministermallareddy

టీఆర్ఎస్ నాయకులకు ఏమైందో ఏమో కానీ ఈ మధ్య ఆంధ్రా నాయకులను తలదన్నే విధంగా బూతులు మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అయితే పిసిసి అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు ఏ రేవంత్ రెడ్డిపై అత్యంత దారుణమైన కామెంట్లు చేశారు. ఇక్కడ రాయలేని భాషలో ఆయన తొడగొట్టి సవాల్ చేశారు. (వీడియో చూడండి) తెలంగాణ భవన్ లో నేడు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె .పి .వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ- బట్టేబాజ్…. అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. నేను పాలు అమ్మితే తప్పా.. నీలాగా దొంగ పనులు చేసి సంపాదించలేదు..ఒక దారిద్రపు మొకపోడు రేవంత్ రెడ్డి.. ఇప్పుడే సీఎం అయినట్టు కలలు కంటున్నాడు.. బుద్ది లేని మనిషి రేవంత్ రెడ్డి..ఈయన ఎం చేశాడని రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తారు అంటూ మంత్రి ఆవేశంగా వ్యాఖ్యానించారు.

Related posts

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద

Bhavani

వృద్ధాప్య పెన్షన్ డబ్బులతో గ్రామ వాలంటరీ జంప్

Satyam NEWS

జర్నలిస్టు నాగేంద్రకు ఏపిడబ్ల్యూజే మద్దతు

Satyam NEWS

Leave a Comment