Slider మహబూబ్ నగర్

మాలల ఆరాధ్యదైవం పివి రావు జయంతి వేడుకలు

#malamahanadu

మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పివి రావు 73 వ జయంతి తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం, దళితుల ఐక్యత కోసం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల మహానాడు ని స్థాపించి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ చెల్లదని తేల్చి చెప్పిన మహానుభావుడు స్వర్గీయ పివి రావు అని కొనియాడారు.

రాజ్యాంగ వ్యతిరేకంగా కొంతమంది స్వార్థపూరితంగా 59 కులాలకు సమానంగా 15 శాతం ఉన్న రిజర్వేషన్ ను వర్గీకరించాలి అని, దళితులను విచ్ఛిన్నం చేయాలని చూసిన దుష్ట శక్తుల బుద్ధి చెప్పిన మహానుభావుడు స్వర్గీయ పివి రావు అన్నారు. మాలలకు ఎనలేని సేవలు చేసిన మాలల ఆరాధ్యదైవం స్వర్గీయ పివి రావు అని కొనియాడారు.

అంబేద్కర్ ఆలోచనా విధానంతో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన త్యాగమూర్తి స్వర్గీయ పివి రావు అన్నారు. స్వర్గీయ పివి రావు ఆశయ సాధన కోసం మాలల అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనుపోతుల కర్ణ,  జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు మనోజ్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అజిత్ కుమార్, నియోజకవర్గం అధ్యక్షులు తోళ్ళ మాసయ్య, పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంత్రి నవీన్ కుమార్, పట్టణ గౌరవ అధ్యక్షులు సాతర్ల పెంటయ్య, మరియు గాదె అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెండు నెలల్లో 1300 ఇళ్లు పూర్తి కావాలి…!

Bhavani

రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

భారత ప్రధానుల్లో పిన్న వయస్కుడు రాజీవ్ గాంధీ

Bhavani

Leave a Comment