పెంట్లవెల్లి మండలం జెటప్రోల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరి పంటను దళారుల దగ్గరకి తీసుకుపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రనికి తీసుకురావాలని రైతులకు చెప్పారు. రైతులకు 100 కిలోల వరి ధాన్యానికి 1835 రూపాయల ధర ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతులకు మేలు కలిగించేందుకు ఈ చొరవ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రైతులకు సంక్షేమం కలిగించే చర్యలనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్పంచ్ ఖాజా మియ్యా, జడ్పీ జిల్లా ఖో ఆప్షన్ సభ్యులు మతీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హన్మంత్ ,నాయకులు రాజేష్, సురేందర్ గౌడ్, వేణు గోపాల్ యాదవ్, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
previous post