Slider కరీంనగర్

ట్రాజెడీ: క్రైమ్ రిపోర్టర్ గడ్డం శ్రీనివాస్ ఆకస్మిక మృతి

#Journalist Gaddam Srinivas

మూడు రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్న క్రైమ్ రిపోర్టర్ గడ్డం శ్రీనివాస్ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి  కరీంనగర్ లోని ఆయన నివసించే ఇంటికి  తీసుకువచ్చారు.

టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘం నాయకులు శ్రీనివాస్ భౌతికదేహంపై పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం  అంత్యక్రియల నిర్వహణ కోసం టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ పక్షాన రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, కోశాధికారి శరత్ రావు, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, విజయ భాస్కర్, కార్యవర్గ సభ్యులు మధు, తిరుపతి, సురేందర్ రెడ్డి, రామకృష్ణ, మహేందర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేరు కరుణ ధీరణి

Satyam NEWS

జపాన్ లో ప్రవాసులపై మోడీ సమ్మోహనాస్త్రం

Satyam NEWS

ఆవిర్భావ సభ వేదికను పరిశీలించిన మెగా బ్రదర్

Sub Editor 2

Leave a Comment