Slider నిజామాబాద్

ఈ మాటలు మోడీనీ కేసీఆర్ ను కదిలిస్తాయా?

#Video Message to Modi

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఓ సాధారణ రైతు బిడ్డకు కడుపు రగిలిపోయింది. లాక్ డౌన్ వల్ల సాధారణ ప్రజల కష్టాలను సెల్ఫీ వీడియో ద్వారా సీఎం కేసీఆర్, ప్రధాని మోడీకి వివరించారు. ప్రస్తుతం ఆ రైతు బిడ్డ ఆవేదన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ, నిరుద్యోగ యువకుడు బుర్ర అంజాగౌడ్ అధిక ధరలు, కల్తీ మందులపై పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధిక ధరలను నియంత్రించాలని సీఎం కేసీఆర్, పీఎం మోడీకి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడా యువకుడు.

తెలంగాణలో సాధారణ కుటుంబాలు వ్యవసాయం, కూలి, బీడీలపై ఆధారపడి ఉన్నాయని, ఈ పనుల వల్ల  పెద్ద పెద్ద భవనాలు కట్టడమో, కాశ్మీర్ అందాలను చూడాలనో సాధారణ ప్రజలు అనుకోవడం లేదన్నాడు. లాక్ డౌన్ వల్ల ఎంత మంది లబ్ది పొందారో తెలియదు కాని సాధారణ ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని వెల్లడించాడు.

లాక్ డౌన్ వల్ల సాధారణ కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాకాలం సమీపిస్తున్నందున సకాలంలో నాణ్యమైన ఎరువులు, కల్తీ లేని పురుగు మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసాడు.

కఠోర దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్ కు, ఏళ్ల తరబడి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేయడంతో పాటు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సిద్ధమైన ప్రధాని మోదికి ఇవి చాలా చిన్న విషయాలని తెలిపాడు.

అధిక ధరలను నియంత్రించి కల్తీని అరికట్టే చిన్న విషయాల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని, జై తెలంగాణ, జై మోడీ అంటూ నినదించాడు. రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఆ యువకుడు బీఈడీ పూర్తి చేశాడు.

చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. రెండుసార్లు డిఎస్సి రాసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి తన తల్లిదండ్రులు సంపాదించిన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.

Related posts

శోభాయమానంగా ధనుర్మాస శోభాయాత్ర

Satyam NEWS

రాజకీయ పార్టీ దిశగా ‘జగనన్న వదిలిన బాణం’

Satyam NEWS

షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా పై ముదిరిన వివాదం

Satyam NEWS

Leave a Comment