23.7 C
Hyderabad
May 8, 2024 04: 18 AM
Slider మెదక్

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

#SiddipetCollector

వచ్చే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల పరిధిలోని 4 మండలంలోని 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మొదట ములుగు లోని క్షీర సాగర్ ,తునికి బొల్లారం, సింగన్న గూడ గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ను అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో కలిసి సందర్శించారు. అనంతరం మర్కుక్ మండలం లోని ఎర్రవల్లి, మర్కుక్, దామర కుంట, సిద్దిపేట గ్రామీణ మండలంలోని దోర్నాల దుబ్బాక మండలం లోని హాబ్సి పూర్, చేర్వా పూర్, దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ , తదితర ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను , క్లస్టర్ ఇంచార్జీ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో యాసంగిలో మొత్తం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఒక లక్షా నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించామన్నారు. 70 శాతం ధాన్యాన్ని రైతుల నుంచి ఇంకా సేకరించాల్సి ఉందన్నారు.

యాసంగి లో వరి నాట్లు వేయడం ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే దాదాపుగా పూర్తి అవ్వాల్సిన సేకరణ పదిహేను రోజులపాటు ఆలస్యం కానుందని కలెక్టర్ తెలిపారు. వచ్చే పదిహేను రోజులు ధాన్యం సేకరణకు అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు.

అందుబాటులో 15 లక్షల గన్ని బ్యాగ్ లు

జిల్లాలో ప్రస్తుతం 15 లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ధాన్యం సేకరణ కేంద్రాలకు వచ్చే రెండు రోజుల్లో పది లక్షల గన్నీ బ్యాగులను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

అలాగే రోజుకు ఐదు లక్షల గన్ని బ్యాగులు సరఫరా చేయాల్సిందిగా పౌర సరఫరాల సంస్థ కమిషనర్ కు విజ్ఞప్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు పకడ్బందీ కార్యచరణ తో జిల్లాలో గన్ని బ్యాగ్ లు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

ధాన్యం రవాణా కోసం ప్రైవేట్ వాహనాలు స్వాధీనం

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వేగంగా తరలించేందుకు అవసరమైన వాహనాలను అధికారులకు సమకూర్చడంలో జిల్లాలో ట్రాన్స్ పోర్టు ఏజెన్సీలు విఫలమయ్యారన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితి దృష్ట్యా జిల్లా యంత్రాంగం తనకున్న అధికారాలను ఉపయోగించుకుని ప్రైవేట్ వాహనాలను స్వాధీనం చేసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

సోమవారం ప్రజ్ఞాపూర్ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ రహదారి వద్ద రవాణా, పోలీసు అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రెండు వందల కుపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఆ వాహనాలను ఒక్కో రెవెన్యూ డివిజన్ అధికారుల వద్ద కనీసం 100 తగ్గకుండా స్వాధీన పరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

క్లస్టర్ ఇన్చార్జిల విజ్ఞప్తి, కొనుగోలు కేంద్రాల లో డిమాండును బట్టి వాహనాలను కొనుగోలు కేంద్రాలకు తరలించి దాన్యం వేగంగా మిల్లుల వద్దకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను వచ్చే పది రోజుల పాటు ధాన్యం తరలించేందుకు ఉపయో గిస్తా మని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనల ప్రకారం సదరు ప్రైవేటు వాహనాల యజమానులు అద్దె ఛార్జీలు చెల్లిస్తామన్నారు.

ధాన్యం సేకరణలో ఉపయోగించుకున్న వాహనాలకు వేగంగా అద్దె డబ్బులు చెల్లించేందుకు వీలుగా జిల్లా అదనపు కలెక్టర్ వద్ద 10 లక్షలు , అలాగే రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వద్ద 10 లక్షలు ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు స్థానికంగా ఉన్న ట్రాక్టర్లను ఉపయోగించుకునే స్వేచ్ఛ ను క్లస్టర్ ఇంచార్జీ లకు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ఇంకా సరిపోకపోతే మేడ్చల్ ఇతర జిల్లాల నుంచి కూడ వాహనాలను తెప్పిస్తా మన్నారు.

ధాన్యం ట్రాన్స్పోర్ట్ పూర్తి బాధ్యత రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆర్ టి ఓ లకు అప్పగించామని కలెక్టర్ తెలిపారు.

రైతుల సహాకారంతో టా ర్ఫలి న్ ల కొరత లేకుండా చూస్తాం

జిల్లాలో వర్ష సూచన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో టా ర్ఫలి న్ ల కొరత లేకుండా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం నుంచి జిల్లాకు టార్పాలిన్ లు రావాల్సి ఉండేదని కలెక్టర్ తెలిపారు. కరోనా ఉధృతి, లాక్ డౌన్ నేపథ్యంలో వాటి రాక ఆలస్యం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

హమాలీ కొరత తీర్చడం పై ప్రత్యేక దృష్టి

కరోనా విజృంభణ నేపథ్యంలో హమాలీల కొరత తీవ్రంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిని అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలోని అన్ని కంపెనీలలో పనిచేసే కార్మికులను ధాన్యం బస్తాల లోడింగ్ అన్ లోడింగ్ కు ఉపయోగించుకుంటా మ. అలాగే స్థానికంగా ఆసక్తి ఉన్న యువతను ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ లో భాగం చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని అన్ని రైస్ మిల్ లలోని కార్మికులను ఇందుకోసం ఉపయోగిం చుకుంటా మన్నారు.

కొనుగోలు కేంద్రాల సందర్శన లో జిల్లా కలెక్టర్ వెంట గజ్వేల్ ఆర్ డి వో విజయేంద్ర రెడ్డి, డి ఆర్ డి ఓ గోపాల్ రావు లు పాల్గొన్నారు.

Related posts

కార్మికులను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలి

Satyam NEWS

ప్ర‌సిద్దిగాంచిన విజ‌య‌న‌గ‌రం సంగీత‌ క‌ళాశాల‌లో క‌చేరీలు….!

Satyam NEWS

స్థానిక ఎన్నికల చక్రబంధంలో ఇరుక్కున్న ఏపి సిఎం

Satyam NEWS

Leave a Comment