29.7 C
Hyderabad
May 2, 2024 03: 25 AM
Slider ఆధ్యాత్మికం

పైడతల్లి సిరిమాను సంబరంలో విశేషాలు…!

#paiditalliammavaru

విజయనగరం ఇలవేల్పు, ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను సంబరం..భక్తుల సందడి లేకుండా సాదాసీదాగా ముగిసింది మూడు సార్లు మూడులాంతర్లు వద్ద నుంచీ కోట గుమ్మం వరకు సాగింది.

ఈ సంబరంలో విశేషాలు.

* సరిగ్గా ఒంటిగంటకు…కర్రల దండు వచ్చింది.

*1.15 కు హుకుంపేట నుంచీ సిరిమాను అమ్మవారి కోవెలకు వచ్చింది.

* 02.25 జాలరి వల ,2.40 ఏనుగు రధం…3.10 అంజలి రథం వచ్చాయి.

* 03.40 పూజారి చేరుకున్నారు.

సరిగ్గా 03.50 కు సిరిమాను పై అమ్మ వారి రూపంలో పూజారి కూర్చున్నారు.

*తొలి సారి దేవాలయం నుంచీ కిట గుమ్మం వరకు బయలుదేరిన సిరిమాను

*దాదాపు గంట సమయం పట్టింది.

*ఇలా మూడు సార్లు సిరిమాను రథం..దేవాలయం నుంచీ కోట గుమ్మం వరకు తిరిగింది.

*డీసీసీబీ బ్యాంకు వద్ద నుంచీ డిప్యూటీ సీఎం పాము ల పుష్ప శ్రీవాణి, మంత్రులు బొత్స ,ముత్యం శెట్టి ,ఎమ్మెల్యే కోలగట్ల ,ఎంఎల్సీ సూర్యనారాయణ లు సిరిమాను సంబరం తిలకించారు.

*కోట బురుజు వద్ద నుంచీ పూసపాటి వంశీయుల అశోకగజపతి కుటుంబ సభ్యులు తిలకించారు.

*03.50 బయలుదేరిన సిరిమాను సంబరం… పూర్తయ్యేసరికి రమారమి 05.30 అయ్యింది.

* సిరిమాను రథం తిరిగే సమయంలో రెండు సార్లు మాత్రమే ఎస్పీ దీపికా, కలెక్టర్ సూర్యకుమారి నడిచారు.

*సాయంత్రం 04.45 అయ్యేసరికి ఆకాశం మేఘావృతంగా మారింది.

* ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో హుకుంపేట నుంచీ సిరిమాను దేవాలయం వద్దకు చేరింది.

*దేవాలయం వద్ద పీటీసీ డీఎస్పీ వెంకట అప్పారావు నేతృత్వంలో సిరిమాను రధం సిద్ధమైంది.

*ఈ సారి పదిమంది రోబో బందోబస్తు తో ఎస్పీకి రక్షణ కవచంగా ఉన్నారు.

*అలాగే హై స్పీడ్ కెమారాలతో పాల్కన్ మొబైల్ ర్యాండ్ వెహికల్ బందోబస్తు గా ఉంచారు.

*మంత్రులు వెల్లంపల్లి ,ముత్యం శెట్టి ,బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి లు ఉండటం విశేషం.

*సిరిమాను సంబరం జరుగుతున్న సేపు వీఎంసీ పీఆర్వో ఆడియో యాంకర్ గ వ్యవహరించారు.

* పాత కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ డా.హరిజవహర్ లాల్ పంచకట్టుతో ప్రత్యేక ఆకర్షణ గ నిలిచారు. ప్రతీ ఒక్కరూ ఆయనతో సెల్ఫీకోసం ఎగబడటం కనిపించింది.

*చివరి గా సిరిమాను.. కోట వద్ద నుంచీ రావడంతో ఆ సమయంలో కలెక్టర్, ఎస్పీ లు తిరిగారు.

*ఆఖరి సారి రథం తిరిగే సమయంలో వర్షం పడింది.

* పోలీసు సిబ్బంది తడుస్తూనే బందోబస్తును ఓఎస్డీ సూర్య చంద్రరావు నేతృత్వంలో వ్యవహరించారు.

*మొత్తానికి సి‌రిమాను సంబ‌రం ముగిసింది.

Related posts

తరువుతో లేదు కరువు

Satyam NEWS

ఎయిమ్స్‌ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌

Sub Editor

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Satyam NEWS

Leave a Comment