29.7 C
Hyderabad
May 3, 2024 03: 19 AM
Slider ప్రపంచం

విభజన సమయంలో విడిపోయిన సోదరుడిని కలుకోడానికి పాక్ అంగీకారం

#pakistan

దేశ విభజన కారణంగా 74 సంవత్సరాల క్రితం విడిపోయిన తన సోదరుడిని కలుసుకోవడానికి భారతదేశంలోని పాకిస్తాన్ హై కమిషన్ శుక్రవారం ఒక భారతీయ సీనియర్ సిటిజన్‌కు వీసా జారీ చేసింది. దేశ విభజన సమయంలో అంటే 1947లో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు 74 ఏళ్ల తర్వాత కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌లో ఇటీవలే కలుసుకున్నారు. కర్తార్‌పూర్ కారిడార్‌లో తోబుట్టువులు ఒకరినొకరు కలుసుకున్న వీడియో అప్పటిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరిహద్దుకు ఇరువైపులా ప్రజలు అప్పటిలో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. 78 ఏళ్ల సికా ఖాన్‌ సోదరుడు మహమ్మద్ సిద్ధిక్ పాకిస్తాన్ లో ఉంటున్నాడు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఫైసలాబాద్ జిల్లా శివార్లలోని ఫుగారన్ గ్రామానికి చెందిన సిద్ధిక్ రెండేళ్ల క్రితం కెనడాకు చెందిన సిక్కు సామాజిక కార్యకర్త ఒకరిని తన సోదరుడి విషయంలో సంప్రదించాడు. ఇద్దరు సోదరులను తిరిగి కలపడానికి సామాజిక కార్యకర్త సహాయం చేశారు. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు వీసా వచ్చింది. నేను ఇప్పుడు ప్రయాణించి (నా సోదరుడిని) కలుస్తాను”అని సికా ఖాన్ రాయబార కార్యాలయంలో రికార్డ్ చేసిన వీడియో సందేశంలో తెలిపారు. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 2019లో సిక్కు మత స్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related posts

ములుగు జిల్లాలో తొలిమెట్టు పై సమీక్ష

Bhavani

అజేయకల్లం ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ ల పంపిణీ

Satyam NEWS

నిరుపేద ఆర్యవైశ్యులకు ఆపన్నహస్తం అందించిన దాతలు

Satyam NEWS

Leave a Comment