27.7 C
Hyderabad
May 7, 2024 10: 55 AM
Slider ప్రపంచం

విద్వేషపూరిత ప్రసంగాలపై పాక్ ఆందోళన

హరిద్వార్‌లో జరిగిన ఒక సదస్సులో మైనారిటీలపై హింసను ప్రేరేపించే ఉద్దేశంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పాకిస్థాన్ భారత విదేశాంగ శాఖ ఇన్‌ఛార్జ్ హైకమిషనర్‌ను పిలిపించి ఆందోళన వ్యక్తం చేసింది.

డిసెంబర్ 16 నుంచి 19 వరకు హరిద్వార్‌లోని వేద్ నికేతన్ ధామ్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో వక్తలు ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పాకిస్తాన్ ఆరోపించింది. ఘజియాబాద్‌లోని దాస్నా ఆలయ పూజారి యతి నరసింహానంద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పలువురు వక్తలు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులను చంపాలని పిలుపునిచ్చారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

భారత ప్రభుత్వం వాటిని ఖండించకపోవటం దారుణమని, ఇప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది.ముస్లింలపై తరచూ జరుగుతున్న హింసాత్మక సంఘటనలు “ఇస్లాం పట్ల భయం విషయంలో అధ్వాన్నమైన ధోరణిని” బహిర్గతం చేశాయని.. భారతదేశంలోని ముస్లింలకు సంబంధించి అవాస్తవ చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రకటించింది.

Related posts

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా “ఓ మంచి రోజు చూసి చెప్తా”

Satyam NEWS

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గోడదెబ్బ- చెంపదెబ్బ

Satyam NEWS

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

Leave a Comment