31.2 C
Hyderabad
May 2, 2024 23: 12 PM
Slider జాతీయం

15-18 ఏళ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్

దేశంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు మాత్రమే కోవాక్సిన్ ఇవ్వనున్నారు.

ఇందుకోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం 10వ తరగతి ఐడీ కార్డు కూడా గుర్తింపు కోసం పరిగణిస్తారు. కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఉండకపోవచ్చనే అంచనాతో పదో తరగతి ఐడీని గుర్తింపుగా పెట్టినట్లు కేంద్రం పేర్కొంది.

ప్రభుత్వ డేటా ప్రకారం 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న 100 మిలియన్ మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ చిన్నారులకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. చిన్నపిల్లల వ్యాక్సిన్‌కు దేశంలో చాలా కాలంగా డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.

Related posts

విశాఖలో మరో విషాదం: కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి

Satyam NEWS

బురద రాజకీయాల్లో కూరుకుపోతున్న విలువలు

Satyam NEWS

సూర్య ప్రభ వాహనం పై మాడ వీధుల్లో శ్రీ సౌమ్యనాధ స్వామి దర్శనం

Satyam NEWS

Leave a Comment