26.7 C
Hyderabad
May 3, 2024 10: 23 AM
Slider వరంగల్

పల్లెప్రగతితో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు

errabelly 20

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతోనే గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకున్న మంత్రి ఎర్రబెల్లిని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు న్యూఢిల్లీలో బుధవారం సన్మానించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం చేస్తున్న కృషితో రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా అన్నారు. ‘అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచ్ చొరవతోనే ఈ ఘనత సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి (30 రోజుల ప్రత్యేక ప్రణాళిక) అమలుతో అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయి’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు  బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.బి.పాటిల్, మాలోతు కవిత, వెంకటేష్ నేత, జి.రంజిత్ రెడ్డి, పి.రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంప్లయింట్: మహిళలపై పెరిగిపోయిన అత్యాచారాలు

Satyam NEWS

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Satyam NEWS

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం

Satyam NEWS

Leave a Comment