27.7 C
Hyderabad
May 15, 2024 05: 50 AM
Slider విజయనగరం

ప్రమాదపుటంచున బొబ్బిలి పారాది బ్రిడ్జి

#paradibridge

ఉత్తరాంధ్ర లో పారాది బ్రిడ్జి తెలియని వారుండరు. అందున విశాఖ నుంచీ పొరుగు రాష్ట్రం ఒడిశా లోని రాయఘడకు వెళ్లాలంటే పారాది మీదుగానే వెళ్లాలి. అలాగే అలనాటి బొబ్బిలి యుద్ధం లో ఆ పారాది అప్పుడే ప్రాచుర్యం పొందింది. తాజాగా  అదే పారాది మళ్ళీ వార్తపుటలకెక్కింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని పారాది వద్దే నిర్మితమైన బ్రిడ్జి…. ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టుబడింది. ఆ పారాది బ్రిడ్జి మీదుగా నే నిత్యం ఎన్నో వాహనాలు, ఆర్టీసీ బస్సులు, అలాగే భారీ వాహనాలతో పాటు రాయఘడకు వెళ్లాలంటే ఈ ఆ పారాది బ్రిడ్జే ఆధారం కీలకం. అయితే తాజాగా ఆ పాత ఇనుము తో నిర్మితమైన బ్రిడ్జి అడుగు భాగం అడ్డంగా ఉన్న బ్రిడ్జి కాస్త కిందకు వీ ఆకారంలో ఒంగిపోవడంతో బ్రిడ్జి ఏ క్షణం అయిన కూలిపోయే ప్రమాదం జరగనుంది. ఈ పరిస్థితి ని స్థానికల ద్వారా తెలుసుకున్న బొబ్బిలి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ హుటాహుటిన పారాది బ్రిడ్జి వద్దకు చేరుకుని.. పరిస్థితి ని కళ్లారా చూసి…ఈ రోజు రాత్రి నుంచే ఏ విధమైన ఫోర్ వీలర్స్ బ్రిడ్జి పై నుంచీ వెళ్లరాదని ముందస్తు చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల తో సుమోటోగా చర్యలు తీసుకున్నారు.

Related posts

నిజాంపేట్ కార్పొరేషన్ లో రోజుకో కబ్జా

Satyam NEWS

నూతన విద్యావిధానంపై హర్షం వ్యక్తం చేసిన తపాస్ జుక్కల్

Satyam NEWS

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలి

Bhavani

Leave a Comment