39.2 C
Hyderabad
April 28, 2024 14: 53 PM
Slider ఖమ్మం

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలి

#BRS Lok Sabha

ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ, అప్‌గ్రేడేషన్ కు , అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు, రైల్వే బోర్డ్ చైర్మన్ కు,దక్షిణ మధ్య రైల్వే జీఎం కు లేఖలు రాశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలసి లేఖ అందజేశారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు చాలా నాసిరకంగా ఉన్నందున అవి ప్రయాణీకుల అవసరాలకు సరిపోవడం లేదన్నారు.

రైల్వే స్టేషన్లలో సీసీ టీవీలు , ఎస్కలేటర్లు, లిఫ్టులు, రక్షిత డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, మంచి వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, ఫుడ్ వెండింగ్ స్టాల్స్, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు రైల్వే స్టేషన్లలో కల్పించాలని నామ పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కనీసం రూ.40 కోట్లు మంజూరు చేయాలని లేఖలో నామ కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పరిసర ప్రాంతంలో అనేక పరిశ్రమలను కలిగి ఉన్న కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కనీసం రూ. 40 కోట్లు మంజూరు చేయాలన్నారు. సింగరేణి బొగ్గు గనులు, మణుగూరు వాటర్ ప్లాంట్, భద్రాచలం పేపర్ బోర్డ్ వంటి పెద్ద పెద్ద పరిశ్రమలున్న సంగతి గ్రహించి సానుకూలంగా స్పందించి, కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు నిధులు మంజూరు చేయాలని కోరారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీతో ఎంతో విస్తరిస్తున్న మధిర అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కూడా రూ.40 కోట్లు మంజూరు చేసి, కనీస సదుపాయాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఎర్రుపాలెం , మోటమర్రి, బోనకల్, చింతకాని, కారేపల్లి, చీమలపాడు, గాంధీనగర్ రైల్వే స్టేషన్లను కూడా నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేసి, కనీస మోలిక సదుపాయాలు కల్పించాలని, ఇందుకోసం ఒక్కో రైల్వే స్టేషన్ కు రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని నామ కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.

మంజూరైన భద్రాచలం రోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ కోసం ఎన్నో ఏళ్ళు పోరాటం చేశానని నామ గుర్తు చేశారు. అయితే తెలంగాణా ప్రభుత్వం , సింగరేణి కాలరీస్ కంపిణీ అందజేసిన నిధుల సహాయంతో ఈ రైల్వే లైన్ లో కొంతభాగం సత్తుపల్లి వరకు మాత్రమే పూర్తి చేశారని అన్నారు.

ఇప్పటి వరకు బొగ్గు రవాణాకే పరితమైన సత్తుపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునిక సౌకర్యాలతో బహుళార్థ సాధకంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ప్రజల రవాణా అవసరాలు దృష్టిలో ఉంచుకొని సింగరేణి రైల్వే లైన్ కు సంబంధించి చండ్రుగొండ , సత్తుపల్లి కొత్త రైల్వే స్టేషన్ల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని నామ కోరారు.

పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాండురంగాపురం రైల్వే స్టషన్ లో రైల్ రేక్ సెంటర్ ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేయాలని నామ నాగేశ్వరరావు కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.అలాగే పారిశ్రామికంగా, సింగరేణి పరంగా ఎంతో విస్తరించిన మణుగూరు స్టేషన్ అభివృద్ధి కి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేయాలని నామ కోరారు.

Related posts

విద్యుత్ బిల్లులను వెంటనే మాఫీ చేయాలి

Satyam NEWS

పేదలకు సోనియాగాంధీ రేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అమెరికాకు

Satyam NEWS

Leave a Comment