30.7 C
Hyderabad
April 29, 2024 04: 08 AM
Slider నల్గొండ

ఈనెల 9న జరిగే జైల్ భరో కార్యక్రమం జయప్రదం చేయండి

#CITUNalgonda

కరోనా కష్ట కాలంలో మేము సైతం అంటూ యుద్ధ వీరుల వలె పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 24000 రూపాయలు ఇవ్వటం లేదని, కనీసం వారికి రక్షణ  కూడా కరువైందని,సి ఐ టి యి జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు హరించే పద్ధతి మంచిది కాదని, దేశమంతా కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలు విలవిల అల్లాడుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి,రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎవరి  ప్రియార్టీ వారిదే తప్ప కరోనా భయం నుంచి ప్రజలను ఎలా ఆదుకోవాలి అన్న ఆలోచనే లేదని రోషపతి ఆరోపించారు.

రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల వేతనాల పరిష్కారంలో విఫలం చెందాయి అని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దశలవారీ పోరాటంలో భాగంగా ఈనెల 9న జరిగే జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మెరుగ దుర్గారావు, కుమారి, సైదులు, రాములు, శ్రీను, దేవకర్ణ,పుల్లయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఐ‌టి రంగం ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

Murali Krishna

మైనింగ్ ద్వారా నష్టపోయిన వారికే పెద్ద పీట

Satyam NEWS

ఆసియా కప్ టైటిల్ గెలుచుకున్న శ్రీలంక

Satyam NEWS

Leave a Comment