33.7 C
Hyderabad
April 29, 2024 02: 29 AM
Slider ఖమ్మం

ఐ‌టి రంగం ద్వారా 10 లక్షల మందికి ఉపాధి

#jobmela

రాష్ట్రంలో ఐటీ రంగం ద్వారా ప్రత్యక్షంగా 5.50 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 5లక్షలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జె ఎన్ టి యు అధ్వర్యంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర  హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఖమ్మం విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 35 కంపెనీల ద్వారా తమ తమ సంస్థలో వివిధ హోదాల్లో 3వేల ఉద్యోగాలు కల్పించడం శుభపరిణామం అన్నారు.  జె ఎన్ టి యు  అధ్వర్యంలో విజయ కళాశాల మంచి కార్యక్రమం చేపట్టిందని అందుకు కళాశాల యాజమాన్యాన్ని మంత్రి పువ్వాడ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ కల్పనలో ముందుందన్నరు. రాష్ట్రంలో ఐటీ రంగం ద్వారా ప్రత్యక్షంగా 5.50 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా మరో 5లక్షలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కేటిఆర్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీ ల ద్వారా ఉపాధి లభించిందన్నారు. గతంలో వ్యవసాయ రంగంలో కేవలం చాలిచాలని బియ్యం ఉత్పత్తి చెయ్యగా నేడు ఎవరు ఊహించని రీతిలో మన రాష్ట్రం 3కోట్ల టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరిందన్నారు.

Related posts

ఘనంగా ఎమ్మెల్యే గంప కుమారుని వివాహం

Satyam NEWS

గోదారి ప్రాంతంలో రాత్రి తనిఖీలు చేసిన ములుగు ఎస్ పి

Satyam NEWS

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దొంగల ముఠా

Satyam NEWS

Leave a Comment