31.2 C
Hyderabad
May 3, 2024 02: 30 AM
Slider విజయనగరం

పార్టీ అనుబంధ కమిటీ లు త్వరగా పూర్తి చేయాలి

#kolagatla

పార్టీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల పార్టీ అనుబంధ కమిటీల నియామకం త్వరితగతిన చేపట్టి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ, రానున్న ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని విజయనగరం ఎమ్మెల్యే  కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఈ సాయంత్రం విజయనగరం లో  ఎమ్మెల్యే కోలగట్ల  నివాసంలో జరిగిన నగర పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పార్టీ కమిటీల నియామకంతో పాటు, బూత్ కమిటీలు, అనుబంధ సంఘాల  కమిటీలు ఏర్పాటు త్వరితగతిన  పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  

ఈనెల 8,9 వ తేదీలలో జరిగిన రాష్ట్ర పార్టీ ప్లీనరీ సమావేశాలు ఎవరు ఊహించని విధంగా విజయవంతం అయ్యాయన్నారు. సీఎం జగన్  నాయకత్వంలో  పనిచేస్తూ , పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పని చేస్తూ, పార్టీ విజయానికి పనిచేయాలని అన్నారు.

తన వ్యవహార శైలి, పనితీరు, ప్రజలకు  అందుబాటులో ఉండే విధానాల్లో ఏమైనా లోపాలుంటే  తాను సరిదిద్దుకోవడానికి కృషి చేస్తానన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేశాము  కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామని అన్నారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

విధిగా ప్రతిరోజు  ఆయా డివిజన్లో  పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పర్యటించాలన్నారు. రాష్ట్రంలో మాటల ప్రభుత్వం కాకుండా, చేతలు ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యే కోలగట్ల చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

నిత్యం  ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కోలగట్ల కృషి చేస్తున్నారని అన్నారు. నగరాన్ని కార్పొరేషన్  స్థాయికి తగ్గట్టుగా నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికలలో ప్రతి డివిజన్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలన్నారు.

నగర పార్టీ అధ్యక్షులు ఆశ పు వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జోనల్  ఇన్చార్జిలు ఎస్. వి. వి. రాజేష్, కేదార శెట్టి సీతారామమూర్తి, కంటూబుక్త త విటి రాజు, డాక్టర్ వి ఎస్ ప్రసాద్, అల్లు చాణిక్య, ముద్దాడ మధు, గుజ్జల నారాయణరావు, ఎవర్ణ  కుమారస్వామిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ రేవతి దేవి, జోనల్ ఇన్చార్జి లు కోలగట్ల కృష్ణారావు, జి ఈశ్వర్ కౌశిక్, బొద్దాన అప్పారావు, ముచ్చు శ్రీను, కాళ్ల సూరిబాబు, రెడ్డి గురుమూర్తి, విజయ శంకర్ దుబే, లక్ష్మణరావు, బోనసింగి ఈశ్వరరావు తో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆయా డివిజన్ల పార్టీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యువజన అధ్యక్షులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ ప్రజలకు ఆర్ సీ ఎం ప్రొడక్ట్స్ ప్రారంభించిన సిఐ వెంకట్ రెడ్డి

Satyam NEWS

వైభవంగా రామంతపూర్ బొడ్డురాయి 6వ వార్షికోత్సవ వేడుకలు

Satyam NEWS

అటు రైతుకు ఇటు పేదవాడికి సాయం చేసిన కిషన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment