32.7 C
Hyderabad
April 26, 2024 23: 37 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా పోలీసులకు విజయం కలగాలి

#wanaparthypolice

నిరంతరం ప్రజా సేవలో జీవించే వనపర్తి జిల్లా  పోలీసులకు దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో  విజయం వరించాలని వనపర్తి డిఎస్పీ ఆనంద్ రెడ్డి  ఆకాంక్షించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా  ఈ రోజు  జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  కె.అపూర్వరావు ఆదేశాల మేరకు వనపర్తి డీఎస్పీ  జిల్లా పోలీసు ఆయుధాలకు, వాహనాలకు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలకు, వాహనాలకు, ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణాలతో పూజలు చేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ  మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమసేవలు అందించి మంచిపేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు పోలీసువారిపై ఉండాలని డిఎస్పీ  కోరారు.

చెడుపై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా విజ‌య‌ద‌శ‌మి పండుగ‌ను జ‌రుపుకుంటార‌ని అన్నారు.  స‌మాజంలో చెడును పార‌ద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుంద‌ని తెలిపారు. అదేవిధంగా డిఎస్పీ  జిల్లా పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు దసరా పండుగ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వనపర్తి డిఎస్పీ ఆనంద్ రెడ్డి, సాయదదళ ఇన్స్పెక్టర్లు వెంకట్, జగన్, వనపర్తి సీఐ ప్రవీణ్ కుమార్, కొత్తకోట సీఐ శ్రీనివాసు రెడ్డి, ఆత్మకూరు సీఐ, రత్నం, సీసీఎస్ శ్రీనివాస్ చారి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, సంతోష్ కుమార్, సురేందర్ బాబు,ఎస్పీ. పీఆర్వో రాజగౌడ్,  సాయుధ దళ సిబ్బంది జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఈ నెల 20 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Murali Krishna

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS

మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్న మావో నేత

Sub Editor 2

Leave a Comment