38.2 C
Hyderabad
May 3, 2024 20: 31 PM
Slider ముఖ్యంశాలు

నగర పోలీస్ కమిషనర్ పై ఉత్తమ్ వ్యాఖ్యలు

congress 3

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయలేని భాషలో వ్యాఖ్యలు చేశారు. పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ క్యారెక్టర్ లెస్ ఫెలో అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు ఆయన దిగజారిన వ్యక్తి అని, అవినితి పరుడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అతనికి పోలీస్ కమిషనర్ గా ఉండే అర్హత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం గవర్నర్ ను కలిసి నగర పోలీసు కమిషనర్ పై  ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. సెక్షన్ 8 ప్రకారం నగర పోలీసు కమిషనర్ పై గవర్నర్ కు చర్యలు తీసుకునే అధికారం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా తిరంగా ర్యాలీకి అనుమతి కోరితే నగర పోలీసు కమిషనర్ అనుమతి నిరాకరించారు. ఆర్ ఎస్ ఎస్ కు ఎం ఐ ఎం కు అనుమతి ఇచ్చిన కమిషనర్ తమకు ఎందుకు ఇవ్వడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీ భవన్ వద్ద జరిగిన సత్యాగ్రహంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు.

Related posts

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Satyam NEWS

వనపర్తికి కేఎల్ఐ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు:కెసిఆర్

Satyam NEWS

‘డై హార్డ్ ఫ్యాన్ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌

Satyam NEWS

Leave a Comment