స్వాతంత్ర్య దినోత్సవం, జమ్ముకశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆగష్టు 10 నుంచి ఆగష్టు 20 వరకు దేశంలోని విమానాశ్రయాల్లో సందర్శకులకు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి రద్దు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం, దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సందర్శకులకు అనుమతిపై తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపింది. విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దును తప్పపనిసరిగా ఆయా ఎయిర్ పోర్ట్ అధికారులు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
previous post