39.2 C
Hyderabad
May 3, 2024 11: 08 AM
Slider విజయనగరం

పోరాడి సాధించిన పీడీఎస్ రైస్ బండి ..!

పోరాట‌మే ఊపిరి.. దాని ఫ‌లితం…ఎప్ప‌టికైనా వ‌స్తుంద‌ని నిరూపించింది..సీపీఎం పార్టీ. వివ‌రాల్లోకి వెళితే విజయ న‌గ‌రంలోని అయ్యన్నపెట.. చెంచుల కాలని.. సుందరయ్య కాలని.. వైఎస్సార్ కాలనీ లకు గత ఆరు నెలలుగా గా రేష‌న్ స‌రుకులు ఇంటింటికి రావ‌డం ఆగిపోయింది. ఎందుకా అని ఆరా తీస్తే… ఆ ఏరియా లో డ్రైవర్ ఉద్యోగం.. రిజర్వేన్ కి కేటాయించారు.

కొద్ది నె ల‌ల క్రితం ఉన్న డ్రైవర్ కాస్త మానేయడం తో కొత్తగా ఆ రిజ‌ర్వేష‌న్ కు చెందిన‌ డ్రైవర్ లేక పోవడంతో గత ఆరు నెలలుగా గా రేష‌న్ రైస్ బండి ఆగిపోయింది. ఈ విషయం సీపీఎం పార్టీ దృష్టి కి రాగానే సుందరయ్య కాలని పార్టీ కార్యకర్తలు కమిటీ నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు.. సహకారంతో పోరాటం నిర్వహిం చారు. తహసీల్దార్ కార్యాలయం.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదట ధర్నా నిర్వహించారు.. జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు.

అయినా ఎవరు పట్టించు కొక పోవడంతో సీపీఎం నాయకత్వమే స‌ద‌రు కాలనీలు తిరిగి డ్రైవర్లు ను గుర్తించి 6 మంది తో దరఖాస్తు చేయించి.. అనంతరం అప్పలరాజు అనే డ్రైవర్ని ఒప్పించి ఆయనతో ఐటీడీఏ కి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ద్వారా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. చివరి వరకు సీపీఎం పార్టీ పట్టు వదల కుండా చేసిన కృషి ఫలితంగా. ఆరు నెలలు తరువాత డ్రైవ‌ర్ నియామ‌కం కావ‌డంతో..పీడీఎస్ రైస్ బండి తెచ్చుకో గలిగారు..స‌ద‌రు కాల‌నీ వాసులు..

ఈ పోరాటంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ.. సీఐటీయూ నగర అధ్యక్షుడు బీ . రమణ.. సుందరయ్య కాలని కమిటీ నాయకులు సుజాత.. పద్మ.. సత్యవతి.. సరస్వతి ఉన్నారు.ఇక ఈ రైస్ బండి పునరుద్ధరణ కు జరిగిన కృషిలో సహకరించిన అందరికీ సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు ధన్యవాదాలు తెలిపారు..

ప్రభుత్వము ఇంటింటికీ రేసన్ సరుకులు ఇస్థమని చెప్పి నెలలు తరబడి వాహనం రాకపోతే ప్రజలు పడే ఇబ్బంది వర్నా తీతమని అన్నారు. ఇక పైన అటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిం చాలని అది కారులుని రెడ్డి శంకరరావు కోరారు.

Related posts

మంత్రి మేకపాటి ఎలా మరణించారంటే…..

Satyam NEWS

ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందించాలి

Satyam NEWS

ఉమెన్ పవర్: దేశ ఆర్ధిక వృద్ధికి చోదకులు మహిళలే

Satyam NEWS

Leave a Comment