32.2 C
Hyderabad
May 8, 2024 21: 53 PM
Slider నిజామాబాద్

బిచ్కుందలో శాంతి కమిటీ సమావేశం

#bichkundapeacecommittee

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ పండుగ ఉత్సవాలు ఎంతో పవిత్రమైనవని  కావున ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు.ప్రభుత్వం డీజేలకు అనుమతి ఇవ్వలేదని   కావున ఎవ్వరు కూడా డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు.ఇదివరకే డీజే  నిర్వహకులకు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు.

ప్రతి గణపతి మండపం వద్ద ఇద్దరు నిర్వాహకులు ఉండాలన్నారు.మండపాల పేకాట స్థావరాల నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. గణపతి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు అందరూ నియమనిష్టలతో పూజలు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్సై తోపాటు  రామాలయ కమిటీ చైర్మన్ హజి బాల్రాజ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు   పటేల్ ,ఎంపిటిసి సురేష్ మార్కెట్ డైరెక్టర్ సుదర్శన్,  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్పల్లి గంగాధర్, దర్పల్లి అశోక్, చింతల హనుమాన్లు,  సీనియర్ నాయకులు హజి లక్ష్మణ్,   రెవెన్యూ సీనియర్ నాయకులు రాచప్ప, ఆయా గ్రామాల సర్పంచ్లు ప్రజాప్రతినిధులు గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

జీ లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్

Related posts

మైనారిటీ విద్యార్ధులకు స్కాలర్ షిప్ రద్దును ఉపసంహరించుకోవాలి

Bhavani

మహేష్ బాబు పుట్టిన రోజుకు గిన్నీస్ కానుక

Satyam NEWS

భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS

Leave a Comment