31.2 C
Hyderabad
May 3, 2024 02: 57 AM
Slider ఆదిలాబాద్

కంటైన్ మెంట్ జోన్ లోని వారు బయటకు రావద్దు

indrakarn 151

కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలనేదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలసి పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా క్షేమంగా ఉండాలని భావించి కరోనా వైరస్ ను అంతమొందించేందుకు లాక్ డౌన్ చేశామని అన్నారు. ప్రజలందరూ తమకు తామే స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలన్నారు.

నిర్మల్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించింది. జిల్లాలో 19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 418 మంది శాంపిల్స్ పంపగా  378 వచ్చినవని ఇంకా 43 రిజల్ట్స్ రావాల్సి ఉన్నవని తెలిపారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన 46 మందిలో నలుగురికి పాజిటివ్, యుపి నుండి ముగ్గురు వచ్చారని అందులో ఇద్దరికీ పాజిటివ్ , స్థానిక అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఆరుగురికి, పాజిటివ్ కేసులు ఉన్న వారితో ప్రాథమిక పాఠశాలలు ఉన్నా ఏడుగురికి పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు మంత్రి తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు కంటేన్మేంట్ జోన్ ల లోని ప్రజలు బయటకు రాకుండా రోడ్లన్నీ దిగ్బంధం చేశామని అన్నారు. అందరూ మే 3 వరకు తమ తమ ఇంట్లోనే ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వారి ఇంటి వద్దనే కూరగాయలు నిత్యావసర సరుకులు వాహనాల ద్వారా విక్రయిస్తామన్నారు.

ప్రజలంతా ఇంట్లోనే ఉండి భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని కరోనా కరుణ వైరస్ ను తరిమికొట్టాలి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు లక్షల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామన్నారు. ఈనెల 16 నుండి 23 వరకు సరస్వతి కాలువ నుండి రోజులపాటు సాగుకు నీరు అందిస్తామన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కు 3250 కోట్లు, వరి ధాన్యం కొనుగోలుకు 25 వేల కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఉపాధి హామీ పనులలో సామాజిక దూరం పాటిస్తూ పనులు చేపట్టాలన్నారు. కరెంటు తాగునీరు కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు కారం టైన్ లలో 450 బెడ్స్ ఉన్నాయని తెలిపారు. వైద్యసేవలు అందించడానికి డాక్టర్ల బృందం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో 150 ఆశ ఏఎన్ఎం బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయన్నారు. కోవిడ్19 ప్రాథమిక పరీక్షలు జిల్లాలోని నిర్వహిస్తామని ప్రతి గల ఉంటే హైదరాబాద్ పంపిస్తామన్నారు.

జిల్లా ఎస్పీ రాజు మాట్లాడుతూ జిల్లాలో కరువు నియంత్రణకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కేర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్ జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, జిల్లా వైద్య అధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, డి.ఎస్.పి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసులు నివాళి

Bhavani

కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తనిఖీలు

Satyam NEWS

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు కరోనా

Satyam NEWS

Leave a Comment