38.2 C
Hyderabad
April 29, 2024 11: 46 AM
Slider నల్గొండ

కరోనా నిర్మూలనకు లాక్ డౌన్ తప్ప మార్గం లేదు

Devarakonda

కరోనా నిర్మూలనకు లాక్ డౌన్ తప్ప మార్గం లేదని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం నేరడుగొమ్ము గ్రామంలో  పేద ప్రజలకు బియ్యం,నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజలకు ఎవ్వరికి ప్రభుత్వం ఇబ్బంది రానివ్వదని  తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని ఆయన కోరారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ ను నిర్మూలించగలుగుతాం అని ఆయన తెలిపారు.

కరోనా పై నిర్లక్ష్యం తగదు అని,దగ్గు, జ్వరం, జలుబు తో బాధపడే వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలి కోరారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడాలని, కొరత లేకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

మే 3 వరకు లాక్ డౌన్ ఉంటుందని ఆయన తెలిపారు. ఇది అత్యంత క్లిష్ట సమయం. ప్రభుత్వానికి, అధికారులు, సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు ప్రజలు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మహన్మ నాయక్,జడ్పీటీసీ కేతవత్ బాలు పాల్గొన్నారు.

ఇంకా వైస్ ఎంపీపీ అరేకంటి ముత్యాలమ్మ రాములు,సహకార సంఘం చైర్మన్ బాలయ్య,లోకసాని తిరపతయ్య, సర్పంచ్ పల్స బలమణివెంకటయ్య,వాంకునవత్ బిక్కు నాయక్, బాషా, రమేష్, వాడిత్య బాలు, ముక్కమల్ల సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

థాయ్ బాక్సింగ్ తో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్

Satyam NEWS

అర్జీయూకేటీ బాసర 5వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

వంగర, లక్నేపల్లి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment