32.2 C
Hyderabad
May 8, 2024 22: 06 PM
Slider మహబూబ్ నగర్

తలకొండపల్లి మండలం వరి ధాన్యం కొనుగోలు

padkal center

నాగర్ కర్నూలు జిల్లా తలకొండపల్లి మండలంలోని పడకల్ మరియు వెలిజాల గ్రామపంచాయతీలో వరి కొనుగోలు కేంద్రాలను కసిరెడ్డి నారాయణరెడ్డి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల పి ఏ సి ఎస్ చైర్మన్ , సర్పంచ్ లతో కలిసి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ మద్దతు ధర తో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అకాల వర్షాలు వడగండ్ల వానతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేల పాలయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

వందల కుటుంబాల రైతులు రోడ్డున పడుతున్నారని ఇటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతే రాజ్ అంటున్నారు. గత ఎనిమిది,తొమ్మిది నెలల క్రితం వెల్జాల్ సహదేవ సముద్రం చెరువులో చేపలు వేసినాడు పాలమూరు నీళ్లు వస్తాయని సంవత్సర కాలంలో కాలువలు వస్తాయని, ప్రజలను మభ్య పెడుతున్నారు కానీ ఆ చెరువు ఎండిపోతున్న సమయంలో లో వాడే ల పైపులైన్ ద్వారా చెరువు నింప వలసిందిగా కోరుతున్నామని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వాలని అక్కడికి హాజరైన నాయకులను డిమాండ్ చేశారు.

అదేవిధంగా తలకొండపల్లి మండలం లో  4300 మంది పేద బలహీన వర్గాల వారు తెల్ల రేషన్ కార్డు కొరకు అప్లై చేయగా వారికి నేటికీ రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారిని 12 కిలోల బియ్యం ప్రభుత్వం ప్రకటించిన పది వందల రూపాయలు అందించే విధంగా బాధ్యత కలిగిన అధికారులను ఆదేశించాలని నాయకులను కోరారు. ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు.

 తెలంగాణ ప్రభుత్వం కరోనా నించి కాపాడడమే కాదు కరువు నుంచి పేద ప్రజలను కాపాడే బాధ్యత కూడా ఉందని ఆయన అన్నారు. లాక్ డౌన్ పొడిగించినంధుకు కాను పేద బడుగు బలహీన వర్గాలు రోజువారి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీపీ నిర్మల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలి

Satyam NEWS

8వ విడత హరిత హారం కు ఏర్పాటు చేసుకోవాలి

Satyam NEWS

దేవేంద్ర ఫడ్నవీస్ కు ఊహించని దెబ్బ

Satyam NEWS

Leave a Comment