28.7 C
Hyderabad
May 5, 2024 23: 12 PM
Slider వరంగల్

భారీ వర్షాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి

#jakaram

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఇంకా మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు జిల్లా జాకారం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ కోరారు. గ్రామస్తులు తప్పని సరిగా అప్రమత్తంగా ఉండాలని, తడిసిన స్తంభాలను ముట్టుకోవద్దని ఆయన కోరారు.

విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదలకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. విద్యుత్ ఘాతంతో పాడి గేద మృతి చెందిన ఘటన ములుగు మండలం జకారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన రాస మల్ల శివాజీకి తన ఇంటి వెనకాల గల రేకు ల షెడ్డు లో తన పాడు గేదెను కట్టి  ఉంచారు . ఈ క్రమంలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న  వర్షాల కారణంగా రేకుల షెడ్డుపై కరెంటు తీగ పడి షార్ట్ సర్క్యూట్ జరిగింది ఈ క్రమంలో షెడ్డులో ఉన్న పాడి గేదెకు విద్యుత్  ఘాతంతోగి గేదె  మృతి చెందింది. కాగా గేద ఖరీదు దాదాపు 40 వేల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని శివాజీ ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

హన్మకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Satyam NEWS

ఆస్తి తగాదాలో అన్నను హత్య చేసిన తమ్ముడు

Satyam NEWS

అభాగ్యులకు ఆహా హెల్పింగ్ హాండ్స్ చేయూత

Satyam NEWS

Leave a Comment