40.2 C
Hyderabad
April 29, 2024 17: 01 PM
Slider కరీంనగర్

అభాగ్యులకు ఆహా హెల్పింగ్ హాండ్స్ చేయూత

#Vemulawada

లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక అలమటిస్తున్న అభాగ్యులకు విజయలక్ష్మి డెవలపర్స్ సహకారంతో ఆహా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతున్నది.

నాల్గవ రోజు అయిన బుధవారంనాడు సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ ఆహార ప్యాకెట్లను పంపిణి చేశారు.

విజయలక్ష్మి డెవలపర్స్ సహకారంతో వైస్ ఛైర్మన్ మధు రాజేందర్ తో కలిసి ఆహా ఫౌండేషన్ సభ్యులు రాజన్న ఆలయం ముందు, పార్కింగ్ స్థలాల్లో జీవనం సాగిస్తున్న నిరుపేదలకు, కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లను అందచేశారు.

గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో కూడా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార ప్యాకెట్లను అందజేయడంపై వేములవాడ పట్టణ ప్రజలతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆహా హెల్పింగ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, విజయలక్ష్మి డేవలపర్స్ డైరెక్టర్ కనపర్తి శ్రీనివాస్, సభ్యులు దూలం రఘు, అంబటి చందు, అంబటి సందీప్, మొట్టల విజయ్ లు ఉన్నారు.

Related posts

Good News: కరోనా వ్యాక్సిన్ డోసు వెయ్యి రూపాయలు

Satyam NEWS

ఓపెన్ లెటర్: అమ్మ ఒడి పథకం పేరుతో మోసం

Satyam NEWS

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

Satyam NEWS

Leave a Comment