42.2 C
Hyderabad
May 3, 2024 17: 59 PM
Slider ముఖ్యంశాలు

ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉంది: డాక్టర్ బ్రహ్మారెడ్డి

#healthcamp

ప్రజల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని డాక్టర్లు ప్రజలను చైతన్యం చేయాలని ప్రముఖ డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. ప్రజావైద్య శాల హాస్పిటల్ ప్రారంభమై 35 ఏళ్లు జరుపుకున్న సందర్భంగా శుక్రవారం వనపర్తి ప్రజా వైద్యశాలలో 20 మంది స్పెషలిస్టులతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల్లో ఒక శాతానికి మాత్రమే డాక్టర్ల వైద్య సేవల అవసరం ఉందన్నారు.

రోగాలు రాకుండా సూత్రాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. రోగులకు డాక్టర్లపై నమ్మకం పెంచాలన్నారు. వైద్యం కోసం డబ్బులు బేరమాడటం సరికాదన్నారు. తాము తమ శిష్యులు దాన్ని అనుసరిస్తున్నామన్నారు. వనపర్తి లో ప్రజా వైద్యశాల మన్నన పొందిందన్నారు డాక్టర్ మురళీధర్ కుటుంబం ఇక్కడే స్థిరపడి వైద్య సేవలు అందిస్తోందని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్. మురళీధర్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ బిజెపి రాష్ట్ర నాయకులు బి కృష్ణ సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు తెలుగుదేశం రాష్ట్ర నాయకులు అచ్యుతరామారావు, ప్రముఖ న్యాయవాది భరత్ కుమార్ డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ భగవంతు కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు గంధం నాగరాజు తదితరులు మాట్లాడారు. బ్రహ్మ రెడ్డి ని మురళీధర్ ను పలువురు సన్మానించారు. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల బాధ్యులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

Satyam NEWS

కృత్రిమ గుండె సృష్టి ఎంత వరకూ వచ్చింది?

Satyam NEWS

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూల‌నే ల‌క్ష్యం

Satyam NEWS

Leave a Comment