29.7 C
Hyderabad
May 6, 2024 05: 48 AM
Slider ప్రత్యేకం

350 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన భట్టి

#bhatti

సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 35వ రోజు సాగుతున్నది. 350 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తూ కాల్వ శ్రీరాంపూర్ (పెద్దపల్లి జిల్లా) కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఎండలను లెక్కచేయకుండా స్వాగతం పలికిన కాల్వ శ్రీరాంపూర్ ఆడబిడ్డలకు, గ్రామప్రజలకు పేరుపేరునా ప్రత్యేక నమస్కారాలు తెలియచేశారు.

ఈ ఎండల్లో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మీ అందరితో మాట్లాడుతూ ఇబ్బందులు, సమస్యలు తెలుకుని వాటి పరిష్కారం కోసం పోరాటం చేసేందుకే మా ప్రయత్నం అని ఆయన అన్నారు. ఎన్నికలు ఉన్నాయనో, లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడిగేందుకు మేము రావడం లేదు. మేము వచ్చింది.. తెలంగాణ ప్రజల సుభిక్షం కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు.. సమస్యలు దూరం చేసి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించేందుకు పాదయాత్ర చేస్తున్నాం అని భట్టి అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. అనేది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయత్వం ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు.

పాదయాత్ర సాగుతున్న ప్రతి చోటా ప్రజలు తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు వస్తున్నారు. ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం నుంచి మొదలైన పాదయాత్రలో ప్రతి చోటా అనేమ సమస్యలు, ఇబ్బందులు మా ద్రుష్టికి వచ్చాయి.

పెద్దపల్లి నియోజకవర్గంలోనూ.. ప్రజలు పడుతున్న కష్టాలు, సమస్యలు మా ద్రుష్టికి వచ్చాయి.  తెలంగాణ తెచ్చుకున్నది.. ఇక్కడి ప్రజల కోసమేకానీ.. డబ్బులు పంచి అధికారంలోకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోసం కాదు. పెద్దపల్లి నియోజకవర్గంలో 9 ఏళ్లుగా మనోహర్ రెడ్డి ఒక్క అభివ్రుద్ధి పనిచేయలేదు. సహజ వనరులు అమ్ముకుంటూ.. అడ్డుకున్నవారిపై కేసులు పెడుతూ.. ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు మనోహర్ రెడ్డి తలవంపులు తెస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేని స్థితికి వచ్చాయి అని ఆయన అన్నారు.

మన రాష్ట్రం, మన నిధులు, మన నియామకాలు.. ఆత్మ గౌరవం కోసం తెచ్చుకుంటే.. టీఆర్ఎస్ పాలనలో అవేవీ మనకు దక్కడం లేదు. ఈ నియోజకవర్గానికి 9 ఏళ్లనుంచి కొత్తగా ఒక్కఎకారనికి చుక్క నీళ్లుకూడా ఇవ్వలేదంటేనే మనం ఎంత మోసపోయామో అర్థమవతోంది. ప్రతి నియోజకవర్గానికి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీళ్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వాస్తవంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదు. ఇక్కడ పారుతున్న నీళ్లన్నీ.. శ్రీరాం సాగర్ నుంచి వచ్చినవే. ఈ దుర్మార్గుల పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భట్టి అన్నారు.

ఈ ప్రాంతంలో చివరి భూములకు సైతం నీళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ దే. కొండనాలుక్కి మందేస్తే ఉన్నా నాలుక ఊడినట్లుగా టీఆర్ఎస్ పాలన ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. కొత్తగా నీళ్లు రాలేదు.. వచ్చే నీళ్లుకూడా రాకుండాపోయాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కట్టిన బావులు, చెక్ డ్యాములు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మనోహర్ రెడ్డి.. నువ్వు కట్టిన 5 చెక్ డ్యాములు ఎండాకాలంలో కడితే.. వానాకాలంలో కొట్టుకుపోయాయి. ఇవి ఎవరికోసం కట్టినట్లు.. ఎందు కోసం కట్టినట్లో ప్రజలకు చెప్పాలి. ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందో కూడా ప్రజలకు వివరించాలి.

ప్రజల సొమ్ము దోపిడీ.. మట్టి దోపిడీ.. ఇసుక దోపిడి.. ఆఖరికి విద్యా దొంగలా కూడా మనోహర్ రెడ్డి తయారయ్యాడు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడేలా చేస్తూ.. తన సొంత విద్యాసంస్థలను పెంచుకుంటున్నాడు. ఈ కార్నర్ మీటింగ్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, గంటా రాములు యాదవ్, ప్రకాస్ రావు, లంకా సైదయ్య, అక్బర్ అలీ, సతీష్, ఎండీ మునీద్, అన్నయ్య గౌడ్, రమేష్, మహేష్ , శ్రీనివాస్, భూపాల్లి డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చాకిరీ చేయించుకుని బడ్జెట్ లేదని ఎమ్.ఇ.సి.సి లను రోడ్డున పడేస్తారా

Satyam NEWS

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దేశం నుండి తరిమేయాలి

Satyam NEWS

వైకుంఠధామం నిర్మాణానికి భూమిపూజ

Satyam NEWS

Leave a Comment