39.2 C
Hyderabad
April 28, 2024 13: 40 PM
Slider పశ్చిమగోదావరి

చర్యలు శూన్యం: తూతూ మంత్రంగా విచారణ

#pedavegi

ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్ ఒకరు పెదవేగి మండల పరిషత్ కార్యాలయ అధికారుల పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించాలని సాంఘీక సంక్షేమ శాఖాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై సాంఘీక సంక్షేమ శాఖ అసిస్టెంట్ వెల్పేర్ అధికారిని విచారణాధికారిగా నియమించినట్టు సమాచారం. అయితే విచారణాధికారి విచారణ జరపాల్సిన తేదీన రాకుండా మరుసటి రోజు విచారణ జరపడానికి వచ్చి తూతూ మంత్రంగా విచారణ చేసి నట్టు మండల పరిషత్ అధికారులు తెలుపుతున్నారు. విచారణ జరిపి 20 రోజులు కావస్తున్నా  విచారణ లో ఏమి తేల్చారనేది ఇంతవరకు అధికారులు వెల్లడించలేదని తెలిసింది. వెల్పేర్ అసిస్టెంట్ పై జరిగిన విచారణ పక్కదారి పట్టిందని మండల పరిషత్ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

కడపలో ల్యాబ్ టెక్నీషియన్ ల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రోగ్రాం కార్యదర్శిగా పసల ప్రసాద్

Satyam NEWS

పవిత్రమైన వైద్య వృత్తిని అపవిత్రం చేయవద్దు

Satyam NEWS

Leave a Comment