29.7 C
Hyderabad
May 7, 2024 04: 40 AM
Slider విజయనగరం

చరిత్ర ను తుంగలోని నెట్టేస్తోందీ జగన్ ప్రభుత్వం..

#kimidinagarjuna

గత చరిత్ర ను పేర్లు మార్పిడి తో తుంగలో కి నెట్టే చర్యలకు జగన్ ప్రభుత్వం పాల్పడటం పధ్ధతి గా లేదన్నారు విజయనగరం టీడీపీ నేత నాగార్జున. పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.1904 లో కట్టిన నాటి వైద్య శాలను..నాటి రాజువంశీయులైన పూసపాటి వారు కట్టారని..టీడీపీ హాయాంలో దాన్ని అభివృద్ధి పరచడం జరిగిందని నాగార్జున గుర్తు చేసారు.

మరల 1994లో టీడీపీ ప్రభుత్వ హాయాంలో నాడు చంద్ర బాబు ప్రభుత్వం లో అభివృద్ధి చేసి మహారాజ ప్రభుత్వ వైద్యశాల గా రూపాంతరం చెంది అన్ని వర్గాల వారికి అందుబాటులో కి వచ్చిందన్నారు. కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్ళ లో రాష్ట్ర చరిత్ర…పుట్టుపూర్వోత్తరాలనే మార్చేస్తోందని నాగార్జున విమర్శించారు. మొన్న అమరావతి నిన్న హెల్త్ యూనివర్సిటీ తాజాగా విజయనగరం మహారాజ ప్రభుత్వ వైద్యశాల .ఇలా చరిత్ర కు నిలయం.. ఆనవాళ్లను.పేర్లు మార్చేసి..ఘోర తప్పిదాలకూ దిగడం.. చాలా దారుణమన్నారు.

అధికార బలాన్ని అంగ ,అర్ధబలమనుకుని జగన్ ప్రభుత్వం ఇలాంటి పేరు మార్పులకు దిగుతోందని…తక్షణమే ఈ తరహా చర్యలు ,నిర్ణయాలకు స్వస్తి చెప్పకపోతే… టీడీపీ చూస్తూ ఊరుకోదని నాగార్జున హెచ్చరించారు. ఈ పేర్లు మార్పిడిపై త్వరలో తమ పార్టీ ఆందోళనలు.. పోరాటాలకు సిధ్ధమవుతుఃదని ఆ పార్టీ పార్లమెంటరీ నేత నాగార్జున స్పష్టం చేశారు.

Related posts

అర్నబ్ గోస్వామి అరెస్టుకు లింకు లేదు

Sub Editor

పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment