40.2 C
Hyderabad
April 29, 2024 15: 08 PM
Slider పశ్చిమగోదావరి

రోజు రోజుకూ తీవ్రమౌతున్న చేపల చెరువు వివాదం

#fish pond

ఏలూరు జిల్లా పెదవేగి న్యాయం పల్లి గ్రామం లో చేపల చెరువు వివాదం ఏడాదికోసారి టి డి పి, వై సి పి నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. టి డి పి అధికారం లో ఉండగా న్యాయం పల్లి చెరువు ను న్యాయంపల్లి టి డి పి నాయకులే చేపలు

పెంచేందు పాడుకున్నారు. కొన్ని కారణాలతో పాట గడువు తీరినా టి డి పి నాయకులు ఆ చెరువు లో చేపలు పట్టలేదు. చెరువు పాట గడువు పూర్తి కావడం తో వై సి పి నాయకులు జిల్లా పంచాయతీ అధికారుల అనుమతితో చెరువుకు పాట పెట్టించి పాడుకున్నట్టు చెబుతున్నారు. అయితే చెరువులో చేపలు ఉన్నాయని కొంత గడువు ఇస్తే చేపలు

పట్టుకుంటామని టి డి పి నాయకులు అధికాలను కోరడం తో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం రేగింది. దీనిపై అప్పటి డి ఎల్ పి ఓ( మహిళా డి ఎల్ పి ఓ) టి డి పి, వై సి పి నాయకుల తో న్యాయం పల్లి పంచాయతీ కార్యాలయం లో

సమావేశం నిర్వహించి చెరువు పాట పై బహిరంగం గా విచారణ జరిపారు. ఆ విచారణలో అప్పటి పంచాయతీ కార్యదర్శి ఒకరు పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం, చెరువు పాట విషయం లో నిర్వహించిన పంచాయతీ రికార్డ్ ఒక

వర్గానికి అనుకూలంగా రాసారని, పాట సొమ్ము చెల్లించే పద్ధతి లో కూడా తేడాలున్నాయని వై సి పి నాయకులు అప్పట్లో డి ఎల్ పి ఓ ముందు ఆరోపించారు. కొంత కాలం గడిచాక వివాదం లో ఉన్న ఈ చెరువులో చేపలు పెట్టేందుకు ఒక వర్గం

వలల తో వచ్చి చేపలు పడుతుండగా మరో సారి టి డి పి, వై సి పి వర్గాలు మధ్య ఘర్షణ రేగి చెరువు దగ్గరే ఢీ అంటే ఢీ అనే దశకు చేరుకున్నాయి. అప్పట్లో పెదవేగి పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఎస్ పి గా కృష్ణ కాంత్ విధులు నిర్వహిస్తున్నారు.

న్యాయం పల్లి చేపల చెరువు వివాద సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్ పి కృష్ణకాంత్ వివాదం లో ఉన్న చెరువులో కి ఎవరూ దిగవద్దని చేపలు పట్టవద్దని ఆదేశాలిచ్చి ఇరువర్గాలను అక్కడనుండి

పంపివేశారు. అధికారులు న్యాయం పల్లి చేపల చెరువు వివాదం లో కర్ర విరగ కూడదు పాము చావకూడదనే విధంగా వ్యహరిస్తున్నారని అందువల్లే మరోసారి న్యాయం పల్లి చేపల చెరువు వివాదం ఇరువర్గాల మధ్య భగ్గుమనే పరిస్థి

ఏర్పడుతుందని న్యాయం పల్లి ప్రజలు వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న పెదవేగి ఎస్ ఐ లక్ష్మణ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి టి డి పి .వై సి పి నాయకులతో చర్చిస్తున్నారు.

Related posts

విజయనగరం లో రహదారి భద్రతా ఉత్సవాలు

Satyam NEWS

జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి

Bhavani

కరోనా వేళ సంక్షేమ మార్గంలో నిర్మలమ్మ బడ్జెట్

Satyam NEWS

Leave a Comment