28.7 C
Hyderabad
April 28, 2024 09: 35 AM
Slider ప్రత్యేకం

ఫోనిక్స్ పెయింటింగ్, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

#MinisterSrinivasagowd

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో కళాకారుల సంక్షేమం కోసం Phoenix పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూపొందించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కళాకారులలో మనోధైర్యాన్ని నింపడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్టేట్  గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించామన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను నేటి నుంచి ఈ నెల 12 వ తేది వరకు 6 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ పెయింటింగ్, ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుండి  ప్రముఖ పెయింటర్ లు ఆగచారీ, రీతూ జైన్, కాంత రెడ్డి, మోగు సింగ్, రియాజ్ అహ్మద్, మారేడు రాము, మధు కరువా, రఘు ఆకుల లతో పాటు 105 మంది కళాకారులు రూపొందించిన పెయింటింగ్ లు, ఫోటోగ్రఫీ లను  ప్రదర్శిస్తున్నామన్నారు.

పెద్ద కంపెనీలే పెట్టుబడి పెడుతున్నాయి

దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీ మన హైదరాబాద్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక, పరిశ్రమల, IT శాఖ ల మంత్రి KT రామారావు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి లో తీర్చిదిద్దాటం వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీ లు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

కరోనా నేపథ్యంలో కళాకారులు పూర్తిగా నష్టపోయారు కాబట్టి మళ్ళీ నూతనంగా తమ కెరీర్ ను ఆరంభించుకోవడానికి  తెలంగాణ ప్రభుత్వం కళాకారుల కోసం ఈ విన్నూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ Dr. K లక్ష్మీ, ప్రముఖ చిత్రకారులు పాల్గొన్నారు.

Related posts

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రోడ్లు అధ్వాన్నం

Satyam NEWS

వి ఎస్ యూనివర్సిటీలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

Satyam NEWS

సీనియర్ జర్నలిస్టు రాంబాబు కరోనాతో మృతి

Satyam NEWS

Leave a Comment