31.2 C
Hyderabad
May 3, 2024 02: 18 AM
Slider ప్రత్యేకం

జగన్ అక్రమాస్తుల కేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం..!

#ys jagan

ఒక వైపు ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారో వివరిస్తూ వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించగా ఇప్పుడు మరో కేసు జగన్ మెడకు చుట్టుకుంటున్నది. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాదాపు 11 సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని గతంలో రఘు రామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే అక్కడ రఘురామకృష్ణంరాజుకు అనుకూలంగా తీర్పు రాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులు పర్యవేక్షిస్తున్న సీబీఐ సక్రమంగా స్పందించకపోవడంతో న్యాయస్థానం ఆ నిర్ణయం తీసుకున్నది. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ సీబీఐ ని పలు దఫాలుగా ప్రశ్నించారు. ఇదే అంశం ఆయన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు కూడా.

ఇది ఇలా ఉండగానే మరో కేసు జగన్ మెడకు చుట్టుకున్నది. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య జగన్ అక్రమాస్తులపై దాఖలు చేసిన పిల్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోందని, 2024 ఎన్నికల లోపే విచారణ జరిపి, నిందితులను శిక్షించాలని కోరారు. అయితే హరిజోగి రామయ్య వేసిన పిల్ ను ముందుగా హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతర తెలిపింది. ఈ అభ్యంతరంపై సుదీర్ఘ వాదనలను జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ విన్నారు. ఈ పిటిషన్ పిల్ గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది ధర్మాసనం.

ధర్మాసనం ముందు హరిరామ జోగయ్య తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలను బలంగా వినిపించారు. వాదనలలో మెరిట్స్ ఆధారంగా న్యాయవాది రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించారు. పిల్ నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశింది హైకోర్టు. అంతేకాక విచారణ ఎందుకు వేగవంత చేయలేకపోతున్నారు..? బెయిల్ గడువును ఎన్ని రోజులు పొడిగిస్తారు…? జగన్ అడిగినప్పుడుల్లా వేలల్లో వాయిదాలు ఎందుకిచ్చారు..? తదితర అంశాలను ప్రశ్నిస్తూ.. హైకోర్టు సీబీఐ, సీబీఐ కోర్టుకు హై కోర్టు నోటిసులు జారీ చేసినట్లు సమాచారం. అలానే జగన్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ విషయంలో, కోర్టు బదిలీపై పిటిషన్ దాఖలు చేయగా.. స్పందించిన సుప్రీం జగన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే.

ఇలా కేసులపై కేసులు జగన్ ను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే జగన్ కు గడ్డుకాలం దాపురించినట్లే కనిపిస్తున్నది.

Related posts

అన్న క్యాంటీన్ త్వరలో ప్రారంభిస్తాం

Satyam NEWS

అభిన‌వ నార‌దుడు…..స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న పోలీస్ పీఆర్ఓ

Satyam NEWS

నగరం రూపు రేఖలు మార్చిన మాపైనా చార్జీషీట్?

Satyam NEWS

Leave a Comment