26.7 C
Hyderabad
May 3, 2024 10: 22 AM
Slider సంపాదకీయం

ప్లీజ్ ఫాలో: కరోనా వ్యాప్తి నిరోధానికి జనతా కర్ఫ్యూ పరిష్కారం

hyderabad airport

బహిరంగ ప్రదేశాలలో కరోనా వైరస్ 12 గంటల పాటు జీవించి ఉంటుంది. ఈ 12 గంటలు ఎవరూ ఇన్ఫెక్టెడ్ స్థలాల వద్దకు వెళ్లపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు 90 శాతం తగ్గిపోతాయి. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 1 లేదా 2 గంటల్లోనే వైరస్ వున్న స్థలాలకు అవసరాల రీత్యా కొత్త వ్యక్తులు వెళుతున్నారు.

వారి ద్వారా మిగిలిన ప్రదేశాలకు వైరస్ వ్యాపిస్తున్నది. 12 గంటల పాటు దేశమంతా ఇంటిలోపలే ఉండగలిగి ఈ పబ్లిక్ ప్లేసులల్లోని వైరస్ మరణించి దీని వ్యాప్తి చెందే చైన్ ప్రక్రియని నిరోధించగలుగుతాం. అప్పుడు మన దేశంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించగలుగుతాం.

అందుకే ఈ 14 గంటల జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఈ ఆదివారం (22వ తేదీ) ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళకే పరిమితమవ్వాలి. ఏమైనా తప్పని పరిస్థితుల్లో ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళాల్సి వస్తే ఉదయం 7 గంటల లోపు మరియు రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళవచ్చు.

బహిరంగ ప్రదేశాలలో క్రిమిసంహారక మందులు, బ్లీచింగ్ పౌడర్ వెదజల్లుతున్నారు. దీనితో బాటు మనం ఇలా 12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళకుండా వుంటే, వైరస్ ను దానంతట అదే మరణించేట్టు చేయగలిగితే 100% కరోనా ను నిర్మూలించగలం. అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేశారు.

ఏ మందులూ పబ్లిక్ ప్లేసుల్లో పిచికారి చేయక్కర్లేదు, తుడవక్కర్లేదు. 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది. అందరూ సహకరిస్తే మనకు ఈ వైరస్ రాకుండా మనం మన పిల్లలని మన వృద్ధులని మన కుటుంబాలని మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకోగలం. మర్చిపోకండి, ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవద్దు. జనతా కర్ఫ్యూ ఈ ఆదివారం (22 March) ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు, అంటే 14 గంటలు. సహకరిద్దాం, ఇది మన భవిష్యత్తు కోసమే.

Related posts

కచ్చితంగా ఘన విజయం సాధించే చిత్రం క్షీరసాగర మథనం

Satyam NEWS

శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన‌…ఆ పోలీస్ స్టేష‌న్ కు శుభ‌వార్త‌…!

Satyam NEWS

కరోనాతో ఛస్తున్నా కుల మత రాజకీయాలేనా?

Satyam NEWS

Leave a Comment