30.7 C
Hyderabad
April 29, 2024 04: 43 AM
Slider విజయనగరం

శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన‌…ఆ పోలీస్ స్టేష‌న్ కు శుభ‌వార్త‌…!

#nellimarla

ఇప్ప‌టికి ముగ్గురు ఎస్ఐ లు  మారారు: నెల్లిమ‌ర్ల పోలీస్ స్టేష‌న్ కు వాస్తు దోష‌మే కార‌ణ‌మా..?

విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్ధంలో ఓ వైపు హోరం..హ‌ర‌..అని శివనామ‌స్మ‌ర‌ణ మోగుతున్న త‌రుణంలోనే…ఆ పుణ్య‌క్షేత్రం ప‌రిధిలో ఉండే  పోలీస్ స్టేష‌న్ కు కొత్త‌గా స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ రాబోతున్న‌ట్టు స‌మాచారం. జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న నెల్ల‌మర్ల‌కు కొత్తె ఎస్ఐ రాబోతున్నారు. ప్ర‌స్తుతం స్టేష‌న్ ఇంచార్జ్ ఎస్ఐ గాసాగ‌ర్ బాబును జిల్లా ఎస్పీ దీపికా నియ‌మించిన‌సంగ‌తి విదిత‌మే.

తాజాగా…ఆ నెల్లిమ‌ర్ల స్టేష‌న్ కు….విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ఎస్ఐగా ఉన్న నారాయ‌ణ బ‌దిలీ కాబోతున్న‌ట్టు పోలీసువ‌ర్గాల స‌మాచారం. ఇటీవలే నెల్లిమ‌ర్ల పోలీస్ స్టేష‌న్ లో ఓ బాదితుడు…లాక్ డెత్ చేసుకోవ‌డంతో…జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది.సాక్షాత్..ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూర్యకుమారి..విచార‌ణ‌కు ఆదేశాలు ఇస్తూ…ఆర్డీఓ భ‌వానీశంకర్ ను నియ‌మించారు.దీంతో అటు స్టేష‌న్ కుఇటు మ‌హారాజా హాస్ప‌ట‌ల్ కు వెళ్లి దిగువ స్తాయిలో ఆర్డీఓ విచార‌ణ చేప‌ట్టి క‌లెక్ట‌ర్ కు నివేదిక ఇచ్చారు.

ఇటీవ‌లే టూటౌన్ పోలీస్ స్టేష‌న్ కొత్త భ‌వ‌నాన్ని ప్రారంభించేందుకు డీజీపీ గౌతంసవాంగ్ వ‌చ్చిన రోజునే..నెల్లిమ‌ర్ల ఎస్ఐ ర‌వీంద్ర  విధుల నుంచీ తొల‌గించింది….పోలీస్ శాఖ‌.ఇక అప్ప‌టి నుంచీ  విజ‌య‌న‌గ‌రం టూటౌన్ ఎస్ఐ సాగ‌ర్ బాబు..ఇంచార్జ్ గా ఉంటున్నారు.తాజాగా శివ‌రాత్రి సంద‌ర్బంగా రామ‌తీర్దం పుణ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శించేందుకు పోలీస్ బాస్  రావ‌డం. విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ఎస్ఐ నారాయ‌ణ ద‌గ్గ‌రుండీ విధులు నిర్వ‌ర్తించ‌డం ప్ర‌దానంగా క‌నిపించింది. కాగా  రూర‌ల్ ఎస్ఐ నారాయ‌ణ‌…గ‌తేడాదిలో  బొడికొండ‌పై రాములోరి విగ్ర‌హ చోరీ కేసులో..ఆ బోడికొండ ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఏ ఒక్క‌రినీ వెళ్ల‌కూడద‌ని చెప్పే విదుల‌లో ప్ర‌ధాన భూమిక పోషించి పోలీసు అధికారుల‌చే శ‌భాష్  అనిపించుకున్నారు.

ఆ స‌మ‌యంలోనే  విలేఖ‌రుల‌ను కూడా…కాద‌డంతో ఒకానొక స్థాయిలో విలేఖ‌రుల‌తో గొడ‌వ  ప‌డ్డారు కూడా.అలా ఒక్క రామ‌తీర్దం బొడి కొండ ఘ‌ట‌న‌లోనే కాకుండావిజ‌య‌న‌గ‌ర రూర‌ల్ లో…ప‌లు గ్రేవ్  కేసుల‌ను చేధించ‌డంలో ఎస్ఐ నారాయ‌ణ అనుభవ‌జ్ఙుడు. ఈ నేప‌ధ్యంలో  నెల్లిమ‌ర్ల‌కు  ఎస్ఐ నారాయ‌ణ‌ను వేద్దామ‌ని..ఇటీవ‌లే పోలీస్ బాస్.. నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కూడా స‌మాచారం. ఇక ఈ రామ‌తీర్ధం  శివ‌రాత్రి  బందోబ‌స్తు పూర్త‌వ్వంగానే…ఎస్ఐ నారాయ‌ణ‌కు బ‌దిలీ అవ్వ‌డం ఖాయ‌మని స‌మాచారం.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

కామవరపుకోట రోడ్డుకు తూట్లు పడ్డాయి

Bhavani

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు

Satyam NEWS

అమరావతి నుంచి రాజధాని మార్పునకు ముహూర్తం ఖరారు

Satyam NEWS

Leave a Comment