28.7 C
Hyderabad
April 26, 2024 08: 50 AM
Slider మహబూబ్ నగర్

కబ్జాల కు గురికాకుండా చెరువులను కాపాడండి

#fishtanks

చెరువులను కుంటలను కబ్జాలకు గురి కాకుండా పరిరక్షించాలని కొల్లాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు పూరి సుధాకర్ పిట్టల సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం తాసిల్దార్ రమేష్ పురపాలక సంఘం కమిషనర్ రాజయ్య కు   మత్స్యకారులు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ పురపాలక సంఘం పరిధిలో ఉన్న చెరువులు కుంటల్లో ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ పరిధిలో భూములు కబ్జాకు గురి కాకుండా ఇండ్ల నిర్మాణం చేయకుండా నియంత్రించాలని చెరువులను అన్యాక్రాంతం కాకుండా చూడాలని మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని అంతేకాకుండా భూగర్భ జల పెరుగుతుందని పక్షులకు జంతువులకు తాగునీరు ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెరువులు కుంటలు పరిరక్షణకు నిధులు ఖర్చు చేస్తుందన్నారు అధికారులు ప్రజా నాయకులు పట్టణ ప్రజలు  కాపాడుకోవాల్సిన బాధ్యత  ఉందని వారికి వివరించారు ఈ కార్యక్రమంలో లో మచ్చ కారులు చాపల రాజు గుంపని గోపి ఆంజనేయులు జలకం లక్ష్మయ్య వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహనీయులను స్మరించుకుంటే మనకు నిత్యస్ఫూర్తి

Satyam NEWS

పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఉడుగుల వాగు బ్రిడ్జి

Satyam NEWS

New Rules: మారుతున్న నిబంధనల ప్రభావం ఏమిటి?

Satyam NEWS

Leave a Comment