40.2 C
Hyderabad
May 2, 2024 16: 30 PM
Slider కడప

బ్యాంకును ముట్టడించిన వైసీపీ నాయకులు

#ycpbank

అధికార పార్టీ నాయకులు ఆందోళన చేస్తారా? చేస్తారు…. ఈ విషయాన్ని కడప జిల్లా అధికార వైసీపీ నాయకులు రుజువు చేశారు. రైతు రుణాలు వడ్డీ తీసుకుని రెన్యువల్ చేయాలంటూ లింగాల ఏపీజీ బ్యాంకును వైసీపీ నాయకులు ముట్టడించారు. లింగాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్  వద్ద వైకాపా నాయకుల ధర్నాకుదిగారు.

రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ సొమ్ము జమ చేసుకొని పంట రుణాలను రెన్యువల్ చేయాలంటూ కడప జిల్లా లింగాల మండల వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, రైతులు బుధవారం ఏపీజీ బ్యాంకు ను ముట్టడించి తాళం వేశారు. సిబ్బందిని బయటకు పంపి వారిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు.

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో పంట రుణాల వడ్డీ మాత్రమే కట్టించుకొని రెన్యువల్ చేయాలని లింగాల మండల వైసీపీ నాయకులు బుధవారం బ్యాంక్ వద్ద రైతులతో కలసి ధర్నా చేసి నినదించారు. బ్యాంక్ మేనేజర్ , సిబ్బందిని బయటికి పంపి బ్యాంక్ లావాదేవీలను స్తంభింప చేసి తాళాలు వేసి ధర్నా చేయడం జరిగింది.

పాత పద్ధతి లో పంట రుణాలను  రెన్యువల్ చేయకుండా కొత్తపధ్ధతి లో అసలు, వడ్డీ కలిపి రుణాలు కట్టమనడం రైతులకు చాలా కష్టమైన పని అని వారు పేర్కొన్నారు.ఏ బ్యాంక్ లలో లేని నిబంధనలు ఒక్క ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ఎందుకుఉన్నాయని వారు ప్రశ్నించారు.

బ్యాంక్ మేనేజర్ సమాధానమిస్తూ బ్యాంకు ఉన్నత అధికారుల నుంచి మంగళవారం వచ్చిన అదేశాలమేరకు రుణం తీసుకున్న అగ్రిమెంట్ బాండ్ మారకుంటే , బాండ్ మారినప్పటికి లోన్ పెంచకుంటే వడ్డీ మాత్రమే కట్టవచ్చని తెలిపారు.రైతులు తమ లోన్ పెంచుకోవాలంటే మాత్రం అసలు ,వడ్డీ రెండు కట్టాలని ఆదేశాలు వచ్చాయన్నారు.

ధర్నా సందర్బంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పాత పధ్ధతిలోనే వడ్డీ మాత్రమే కట్టించుకొని పంట రుణాలు రెన్యువల్ చేయాలన్నారు. వచ్చే సోమవారం లోపల వడ్డీ మాత్రమే కట్టే విధంగా పై అదికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని లేకుంటే సోమవారం మళ్ళీ ధర్నా చేస్తాము అని బ్యాంకు మేనేజర్ ను వారు హెచ్చరించారు.ఈ ధర్నాలో మండల వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Related posts

సొనాలికా ఆగ్రో సొల్యూషన్స్‌ ట్రాక్టర్‌, ఇంప్లిమెంట్స్‌ రెంటల్‌ యాప్‌ విడుదల

Satyam NEWS

రేపటి నుంచి చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఎనాలసిస్: చొచ్చుకువచ్చే చైనాకు చుక్కలు చూపించగలం

Satyam NEWS

Leave a Comment