33.7 C
Hyderabad
April 28, 2024 00: 05 AM
Slider విజయనగరం

పీఎంజేఏవై కార్డులను తక్షణమే పంపిణీ చేయాలి

#vijaya

పేదలందరికీ ఆరోగ్యవంతమైన జీవితం ఇచ్చేందుకు ప్రధాని మోడీ.. ఆరోగ్య కార్డులు ఇస్తే.. రాష్ఠ్ర ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడంలో వైఫల్యం చెందిందంటూ విజయనగరం జిల్లా బీజేపీ ఆరోపించింది. అందుకు నిరసన గా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ బయట భారతీయ జనతా పార్టీ నగర శాఖ నేతల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమంచి సుబ్బారావు  మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల మన రాష్ట్రానికి పంపించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ( పీఎంజేఏవై) పథకం అయిన 5 లక్షల రూపాయల విలువచేసే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భద్రత కార్డును అర్హులైన విజయనగరం పట్టణ ప్రజలకు పంపిణీ చేయమనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ సుమారు 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు సంబంధిత సచివాలయ సిబ్బంది కానీ, ఆరోగ్య కార్యదర్శులు గానీ స్థానిక ప్రజలకు అందించకపోవడం అన్యాయం, అమానుషం అని భారతీయ జనతాపార్టీ నాయకులు తమ బాధను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇమంది సుధీర్ మాట్లాడుతూ ఏదైతే మన భారత ప్రధానమంత్రి  వికసిత భారతమే నా లక్ష్యం అనే ఒక సంకల్పంతో  పనిచేస్తున్నారో!  ఆ సంకల్పానికి భంగం వాటిల్లే విధంగా ఇక్కడ రాష్ట్ర వైకాపా ప్రభుత్వ పాలనా వైఖరి కనబడుతుందని తమ బాధను వ్యక్తం చేశారు. జిల్లా మీడియా ప్రతినిధి, కోర్ కమిటీ ప్రత్యేక సభ్యులు భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి  మాట్లాడుతూ  దేశ ప్రధాని మోడీ నా భారత దేశ ప్రజలు అందరికీ కనీస అవసరాలు అందాలని దృఢ సంకల్పంతో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో భాగంగా దేశ ప్రజల ఆరోగ్య భద్రతతో పాటు విజయనగరం ప్రజలకు కూడా ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య భీమా రక్షణ పథకం అయిన ఆయుష్మాన్ భారత్ కార్డులు గత నవంబర్, డిసెంబర్ నెలలో విజయనగరం వచ్చినా ఇప్పటివరకూ విజయనగరం పట్టణ ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను ఇవ్వకుండా గత నవంబర్ డిసెంబర్ నుండి 3 నెలలుగా సచివాలయాలలోనే దాచుకోవడం దారుణమన్నారు.

ప్రధాని మోడీ ప్రభుత్వం  ఆశయమైన వికసిత భారత్ సంకల్పానికి భంగం కలిగించీ అవమానించే విధంగా ఉందనీ తమ బాధను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి శ్రీను  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇక్కడ ప్రజలకు అందించడంలో రాష్ట్ర వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుందనీ ఇది చాలా అన్యాయం, అమానుషం, అక్రమం అని తమ ఆవేదన తెలియజేసారు. ప్రభుత్వ అధికారులు సచివాలయాలలో కేంద్రం నుండి ఇప్పటికే  వచ్చి ఉన్న ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డులను సచివాలయ సిబ్బంది ద్వారా వీలైనంత త్వరగా విజయనగరం పట్టణం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులను తక్షణమే పంపిణీ చేసి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేశారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీరాములనాయుడుకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇమంది సుధీర్, పసుపు నాటి గిరిబాబు, ఇమంది అమ్మాజీ, గండికోట శాంతి, నీలాపు దేవి, కట్టాశెట్టి బాబు, అప్పారావు దొర, మజ్జి రమేష్, గ్రంధి కృష్ణమూర్తి, కంది సీతారాం, ఇపిల్లి గోపాలకృష్ణ, కొండల శ్రీనివాస్, గొలగాన రమేష్, సోము మహేష్, కుప్పిలి మోహన్ ఆచారి, రిక్కా పైడిరాజు, జమ్ము రాంబాబు తదితరు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related posts

బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్య సేవలు

Murali Krishna

కొల్లాపూర్ లో అధికారి సంతకం ఫోర్జరీ: అయినా పోలీస్ కేసు లేదు

Satyam NEWS

విద్యార్థుల కాళ్లు కట్టేసి..హెడ్‌మాస్టర్ దాష్టీకం…

Satyam NEWS

Leave a Comment