37.2 C
Hyderabad
April 26, 2024 21: 05 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో అధికారి సంతకం ఫోర్జరీ: అయినా పోలీస్ కేసు లేదు

#KollapurOfficer

ఎలాంటి భయం లేకుండా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసేస్తున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అసలు పోలీస్ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో ఇలా అధికారుల సంతకాల ఫోర్జరీలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి.

ఇలా తన సంతకం ఫోర్జరీ చేస్తే సంబంధిత అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అయితే అది కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఓ గ్రామస్థాయి అధికారి  సంతకాన్ని ఫోర్జరీ చేసిన సంఘటన కొల్లాపూర్ ప్రాంతంలో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయంపై అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకి వెళితే కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలత సంతకాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు ఫోర్జరీ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి స్వయంగా చెప్పింది.

ఈ తతంగం మొత్తం చాకలి చెన్నయ్య చేశాడని చెప్పింది. దీనిని పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కానీ పోలీస్ ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఇదంతా కేవలం ఒక  డ్రామాగా కనిపిస్తుంది. ఒక అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే అధికారులు చర్యలు తీసుకోవాలి.

కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా, పోలీస్ ఫిర్యాదు చేయలేదంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇందులో అధికారికి కూడా సంబంధం ఉందనే ఈ మాటలు వినిపిస్తున్నాయి.

విషయం బయటికి వచ్చాక అధికారి జాగ్రత్త పడుతుంది అని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా  అధికారులు దీని పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. కానీ అలా తీసుకోలేదు.

రామాపురం పంచాయతీ కార్యదర్శి  వివరణ ఇలా ఉంది

రామాపురం గ్రామానికి చెందిన చాకలి చెన్నయ్య 8వ తేదిన  స్థల ధ్రువీకరణ పత్రం కోసం  ఆశ్రయించారని చెప్పారు. ఇంతవరకు తన సర్వీస్ లో స్థల ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు అని చెప్పారు. చెన్నయ్య నకిలీ స్థల ధ్రువీకరణ పత్రాన్ని నకిలీ స్టాంపులతో తయారు చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నకిలీ స్థల ధ్రువీకరణ పత్రాన్ని12వ తేదిన సృష్టిం చారని చెప్పింది.

అదే పత్రంతో  రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. దీనిపై ఎంపీడీవో కు  ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎంపీడీవో దీనిపై వివరణ ఇచ్చారు. నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వాస్తవమేనని వెంటనే ఈ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయిస్తామని చెప్పారు. 

ఈ విషయాన్ని దాచి పెట్టే విధంగా ఉందని స్థానికులు అంటున్నారు. పై అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. నిందితుడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పోలీస్ ఫిర్యాదు చెయ్యలేదని అంటున్నారు.

ఈ తతంగం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారని  మరికొందరు అంటున్నారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన నిందితులు, కారకులు ఎంతటికైనా పాల్పడతారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

Satyam NEWS

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani

స్వ‌ల్పంగా పెరిగిన పోలింగ్ శాతం

Sub Editor

Leave a Comment