Slider నిజామాబాద్

పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ

#Pocharam Trust

కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ధైర్య సాహసాలతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో డ్యూటీ చేస్తూ సేవలందిస్తున్న హెల్త్,పోలీస్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు,పాత్రికేయులకు,పూజారులకు,మౌళీ సాహబ్ లకు,పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో బియ్యం,నిత్యవసర వస్తువులను టిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…. గత 45 రోజులుగా కరోనావైరస్ ను  కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో భాగంగా పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది,పాత్రికేయులు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలో 300 మందికి బియ్యం,నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మండలం లోని టాక్లి గ్రామంలో సన్ ఫ్లవర్ పంట కొనుగోలు కేంద్రాన్ని సురేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్,జడ్పీ కోఆప్షన్ మెంబెర్ సిరాజ్,మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్,డాక్టర్ సమత,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు  కిషోర్ బాబు, నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్ రావు, స్ధానిక సర్పంచ్ లు పత్తి లక్ష్మణ్, వర్ని శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన పేద దళిత జర్నలిస్టుకు దళితబందు మంజూరుకు కృషి

Satyam NEWS

డా౹౹చదలవాడను కలిసిన కోడెల శివరామ్

Satyam NEWS

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలి

Satyam NEWS

Leave a Comment