39.2 C
Hyderabad
May 3, 2024 11: 16 AM
Slider ముఖ్యంశాలు

పి వి నరసింహారావుపై కవితల పోటీ ఫలితాలు వెల్లడి

#PVNarasimharao

హైద‌రాబాద్ పాత న‌గ‌ర క‌వుల వేదిక‌, సుర‌భి ఎడ్యుకేష‌న‌ల్ సొసైటీ, సత్యం న్యూస్.నెట్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో భార‌త మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావు శ‌త‌జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జాతీయ‌స్థాయిలో నిర్వ‌హించిన క‌విత పోటీల్లో విజేత‌ల‌ను క‌న్వీన‌ర్ కె. హ‌ర‌నాథ్ ప్ర‌క‌టించారు.

ప్ర‌థ‌మ బ‌హుమ‌తి రూ.3,116 నూటెంకి ర‌వీంద్ర రాసిన లోప‌లి మ‌నిషి క‌విత‌కు, ద్వితీయ బ‌హుమ‌తి 2,116 గుండేటి ర‌మ‌ణ రాసిన బ‌ల‌గంలేని నాయ‌కుడు క‌విత‌కు, తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116లు క‌వ‌యిత్రి నార‌ద‌భ‌ట్ల రాసిన తోర‌ణం క‌విత‌కు ల‌భించాయి.

వీటితోపాటు ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి రూ. 516ల‌కు కొత్త‌ప‌ల్లి ఉద‌య‌బాలు, గుమ్మ‌డి సాంబూమ‌ర్తి, తిరున‌గ‌రి శ్రీ‌నివాస్‌, పీవీఎస్ క్ర‌ష్ణ‌కుమారి, మంజుల సూర్య‌, ములుగు ల‌క్ష్మీమైథిలి, స‌మ్మెట ఉమాదేవి, పూస‌ల ర‌జ‌నీ గంగాధ‌ర్‌, వాడ‌ప‌ర్తి వెంక‌ట‌ర‌మ‌ణ‌, కొలిపాక శ్రీ‌నివాస్‌లు ఎంపికైన‌ట్లు హ‌ర‌నాథ్ ప్ర‌క‌టించారు.

వీరికి త్వ‌ర‌లో నిర్వ‌హించ‌బోయే కార్య‌క్ర‌మంలో బ‌హుమ‌తుల‌ను అందిస్తామ‌ని, అంతేగాక పోటీల‌కు వ‌చ్చిన క‌విత‌ల్లో ఉత్త‌మ క‌విత‌లుగా న్యాయ‌నిర్ణేత‌లు ఎంపిక చేసిన క‌విత‌ల‌తో పుస్త‌కాన్ని తీసుకువ‌చ్చి అదే రోజున ఆవిష్క‌రిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

పోటీకి వచ్చిన అన్ని కవితలను సత్యంన్యూస్.నెట్ లో పోస్టు చేశారు. విజేతల కవితలను మళ్లీ తర్వలోనే సత్యం న్యూస్. నెట్ లో పోస్టు చేయాలని నిర్ణయించారు.

Related posts

తెలుగు వెలుగు

Satyam NEWS

ప్రయివేటు టీచర్లను ఆదుకుంటున్న ప్రభుత్వ టీచర్లు

Satyam NEWS

అశోక్ గజపతి రాజును మళ్లీ అవమానించిన ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment