29.7 C
Hyderabad
May 3, 2024 05: 16 AM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా ఎఫెక్ట్: ఆర్డినెన్సుతోనే ఏపి బడ్జెట్ ఆమోదం

cm jagan

ముందే అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం లేదు. బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలంటే ఉభయ సభలను (అసెంబ్లీ, కౌన్సిల్ )ను పిలవాల్సి ఉంటుంది. కౌన్సిల్ ను రద్దు చేయాలని ఇప్పటికే అసెంబ్లీ తీర్మానించినందున కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదు.

అదీ కాకుండా తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉన్న కౌన్సిల్ బడ్జెట్ కు సవరణలు చేస్తే ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం అసెంబ్లీ సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేసేలా వీలు ఉందేమో అధికారులు యోచించారు.

అయితే అందరి సమస్యలు పరిష్కరించే విధంగా కరోనా ఎఫెక్టు మొదలైంది. దాంతో సమావేశాలను పిలవకుండానే ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ ను అమలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారని సత్యంన్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. బడ్జెట్ ఆమోదం కోసం రేపు ఉదయం 11 గంటలకు క్యాబినెట్ భేటీ కానున్నది.

మూడు నెలల బడ్జెట్ కు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నది. జూన్ 30 వరకూ అవసరమైన  నిధులకు ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్సును గవర్నర్ కు పంపుతారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఆర్డినెన్స్ అమలులోకి వస్తుంది. ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ తీసుకురావడం బహుశ ఇంతకు ముందు ఎన్నడూ జరిగి ఉండదు.

Related posts

ఈ సారి వైభ‌వంగా శ్రీరామ‌న‌వ‌మి మ‌హోత్స‌వాలు

Satyam NEWS

సైబర్ నేరాలపై నాగర్ కర్నూల్ లో అవగాహన

Satyam NEWS

Corona Effect: శ్రీవారి దర్శనాలు మళ్లీ నిలిపివేత?

Satyam NEWS

Leave a Comment