38.2 C
Hyderabad
April 29, 2024 20: 16 PM
Slider విజయనగరం

శాఖా సిబ్బంది ఆరోగ్యంపై పోలీసు బాస్ ప్రత్యేక శ్రధ్ధ..!

#police boss

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా ఎస్పీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్… శాఖా సిబ్బంది కొరకు ఆలోచించిన మాదిరిగా నే ప్రస్తుత ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆలోచించి… వాటిని కార్యరూపం దాల్చుతున్నారు. గతంలో ఎస్పీ మాదిరెడ్డి

ప్రతాప్..సిబ్బందిని ఒ కుటుంబం గా భావించి ప్రత్యేక శ్రద్ధతో గ్యాస్ గొడౌన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుత ఎస్పీ..శాఖా సిబ్బంది ఆరోగ్యం పై..సరాసరి డీపీఓలో నే తిరుమల-మెడికోవర్ తో వైద్య శిబిరం నిర్వహించడం విశేషం.

జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు తిరుమల – మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో ఉచితంగా వైద్య పరీక్షలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిధిగా హాజరై, ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ – పోలీసుశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు సకాలంలో వైద్య పరీక్షలు

చేయించుకోకపోవడం వలన వారి ఆరోగ్య సమస్యలను గుర్తించక అర్ధంతరంగా మృతి చెందడం లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం జరుగుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత తీవ్ర రూపందాల్చిన కారణంగా జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న కొద్దిమంది ఉద్యోగులు చిన్న వయస్సులోనే

అర్ధంతరంగా మృత్యువాత పట్టారన్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లా పోలీసుశాఖకు, సంబంధిత కుటుంబానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందన్నారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సమస్యను ధిగమించడానికి జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హెూంగార్డు నుండి పై స్థాయి అధికారి వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి,

వారి ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు ఉద్యోగుల వైద్య పరీక్షల రిపోర్టులను కూడా డిజిటలైజ్ చేసి, భద్రపర్చి, ప్రతీ ఏడాది వైద్య పరీక్షలు నిర్వహించి, వారి

ఆరోగ్యంపై శ్రద్ధవహించనున్నామన్నారు. పోలీసు ఉద్యోగులు కూడా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలను సకాలంలో చేసుకొని, తగిన వైద్యం పొందే విధంగా శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక సూచించారు.కార్యక్రమంలో తిరుమల – మెడికవర్ ఆసుపత్రి ఎం.డి. డా. తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ – పోలీసులు

ఉద్యోగంలో చేరినపుడు ఎంతో ఆరోగ్యంతో ఉంటారని, తరువాత కాలంలో ఉద్యోగంలో ఒత్తిడి, కాలాతీతంగా విధులు నిర్వహించడం వలన ఆరోగ్యంపై శ్రద్ధవహించని కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. అలా కాకుండా, సకాలంలో

వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స ప్రారంభించినట్లయితే ఆరోగ్యాన్ని తిరిగి మెరుగుపర్చుకోవచ్చునన్నారు. కావున,
పోలీసులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ వహించాలన్నారు.తిరుమల-మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం పోలీసు ఉద్యోగులకు ఫాస్టింగ్ సుగర్, లిపిడ్ ప్రొఫైల్

(కొలిస్ట్రాల్), సీరం క్రియేట్ 9 (కిడ్నీ), ఈ.సీ.జీ., 2డీ ఈకో, టి.ఎం.టి., (గుండెకు సంబంధించిన పరీక్షలను ఉచితం గా నిర్వహించి, రిపోర్టులను పరిశీలించి, ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు తదుపరి చికిత్స అందించడంతోపాటు, వైద్యపరమైన సలహాలను, సూచనలను అందించారు. జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న సుమారు 2000మంది పోలీసు ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) అస్మా ఫర్హీన్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు,
ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, తిరుమల-మెడికవర్ చీఫ్ కార్డియాలజిస్ట్ డా. శరత్ కుమార్ పాత్రో, సూపరింటెండెంట్ డా.

మహేష్, ఐ.సీ.యూ. స్పెషలిస్ట్ డా. పి.ఎస్.వి.రామారావు, సెంటర్ హెడ్ పద్మ కుమార్, ఎఓ పివి నారాయణరావు, ఎస్బీ సిఐ జి.రాంబాబు, ఆర్ఎస్ఐ రమణమూర్తి, ఆర్ఎస్ఎస్ఐలు నారాయణరావు, శ్రీనివాసరావు, నీలిమ, ప్రసాదరావు, రామకృష్ణ, పోలీసు అసోసియేషను అటాక్ అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

దేశ చ‌రిత్ర‌లోనే జ‌గ‌న‌న్న కాల‌నీలు ప్ర‌తిష్ఠాత్మ‌కం

Satyam NEWS

రేపు కరీంనగర్ లో దసరా సినిమా విజయోత్సవ సభ

Bhavani

Leave a Comment