40.2 C
Hyderabad
May 1, 2024 17: 04 PM
Slider విజయనగరం

మహా శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు

#vijayanagaramtemples

700 మంది సిబ్బంది తో బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

మహా శివరాత్రి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లాలోని రామతీర్ధం, రామనారాయణం, వుణ్యగిరి, పారమ్మ కొండ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో నెల్లిమర్ల పీఎస్ పరిధిలోని రామతీర్ధం, విజయనగరం రూరల్ పిఎస్ పరిధిలోని చాకలిపేట వద్ద గల రామనారాయణం టెంపుల్, ఎస్. కోట పిఎస్ పరిధిలోగల పుణ్యగిరి, సాలూరు రూరల్ పిఎస్ పరిధిలోగల పారమ్మకొండకు అధిక సంఖ్యలో భక్తులు దర్శించి కొనేందుకు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా దేవాలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులు నిర్వహించేందుకు 700 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

నదులు, కాలువలు, కోనేరు, సముద్ర స్థానాలు చేసే సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జలాసయాల్లో మునిగి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జలాసయాలు వద్ద పుణ్య స్నానాలు చేసే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు, ఎడీఆర్ఎఫ్ సిబ్బందితో సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు.

చిన్న పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు దర్శించుకునేందుకు, వారికి సహాయ, సహకారాలు అందించేందుకు “పోలీసు సేవాదళ్ ” బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఆలయాల వద్ద ఏర్పాటు తాత్కాలికంగా పోలీసు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే వారు వెంటనే పోలీసు కంట్రోల్ రూంను సంప్రదించి, పోలీసుల సహాయాన్ని పొందాలన్నారు.

పుణ్య స్నానాలు చేసే సమయంలోను, కొండలు ఎక్కే సమయంలోను, దైవ దర్శనాలకు వెళ్ళే సమయంలో మహిళలు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లోను ఒంటరిగా విడిచిపెట్టవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజ్ఞప్తి చేసారు.

ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని, పార్కింగు ప్రాంతాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పని చేయాలన్నారు.

ప్రజలకు సూచనలు చేసేందుకు అవసరమైన చోట్ల పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ను వినియోగించాలని, రికార్డింగు డాన్సులను అనుమతించకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా 700 మందితో పోలీసు బందోబస్తు మహా శివరాత్రి ఉత్సవాలకు ఇద్దరు డిఎస్పీలు 13 మంది సీఐలు,ఆర్‌ఐలు, 38 మంది ఎస్ఐలు/ఆర్ఎస్ఏలు, 128 మంది ఎఎస్ఐలు/హెచ్ సిలు, 225 మంది కాని స్టేబుళ్ళు, 52 మంది మహిళా కాని స్టేబుళ్ళు, 85 మంది హోంగార్డులు, 55 మంది ఎఆర్ కానిస్టేబుళ్ళు, ఎస్టీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహణలో పాల్గొననున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

Related posts

పోలీసులు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

కొల్లాపూర్ టీఆర్ఎస్ నేత అనుచరుల దాడిలో ఒకరి మృతి: ఉద్రిక్తత

Satyam NEWS

కీచక ఉపాధ్యాయుడిని శిక్షించాలి: తమ్మవరం విద్యార్థులకు న్యాయం చేయాలి

Satyam NEWS

Leave a Comment