35.2 C
Hyderabad
April 27, 2024 13: 24 PM
Slider ముఖ్యంశాలు

కీచక ఉపాధ్యాయుడిని శిక్షించాలి: తమ్మవరం విద్యార్థులకు న్యాయం చేయాలి

#chekurilelavati

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అనిల్ చిన్నపిల్లల్ని వేధిస్తున్నాడని ‘విన్నపం ఒక పోరాటం’ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. మూడు, నాలుగు తరగతి చదువుతున్న పిల్లలను ఆటల పేరుతో కళ్ళకు గంతలు కట్టి విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె అన్నారు.

ఆ కీచక హెడ్మాస్టర్ ని గ్రామ ప్రజలందరూ కాళ్లు, చేతులు విరగొట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేయాల్సిందని ఆమె అన్నారు. అలా చేస్తే మరోమారు పిల్లల జోలికి వస్తే ఇదే పరిస్థితి ఎదురౌవుతుందన్న భయాన్ని కలిగించాలని ఆమె అన్నారు. కఠినమైన భయాలు లేనంత కాలం అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయని, సాగదీసినంత కాలం మానవ మృగాల ఆగడాలకు అంతులేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థిని భవిష్యత్తులో ఉన్నత శిఖరానికి నిలబెట్టాల్సిన ఒక ఉపాధ్యాయుడు బాధ్యతను మర్చిపోయి ప్రవర్తించడం హేయమైన చర్య అని, అన్నారు. అలాంటి వారికి తొందరగా కఠిన శిక్ష పడేటట్టు ఎస్ఐ రంజిత్ ని విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక సంస్థ ద్వారా కోరుతున్నామని అన్నారు.

నవంబర్ 14న,బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తూ,ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనల వలన పిల్లలను స్కూల్లో కి దూరం చేయొద్దని,భయపడకుండా వారిలో మనోధైర్యాన్ని కలిగించి విద్యాబోధన నేర్పించాలని లీలావతి కోరారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బాలూ, నీకు కోపం వచ్చిందా?

Satyam NEWS

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

కరోనా నియంత్రణకు జువారి సిమెంట్స్ విరాళం

Satyam NEWS

Leave a Comment