38.2 C
Hyderabad
May 3, 2024 20: 22 PM
Slider కృష్ణ

సైకిల్ టూరిస్టు ఆష కు పోలీసుల అభినందన

#Commissioner Kanti Rana Tata

మహిళా సాధికారత, మహిళా భద్రతపై ప్రజలకు అవగాహనా కల్పించడానికి నవంబర్ 1, 2022 తేదీన మధ్య ప్రదేశ్ నుండి ఆల్ ఇండియా సైకిల్ టూర్ ప్రారంభించి 25 వేల కిలోమీటర్లు పూర్తి చేయాలనే సంకల్పంతో బయలుదేరిన ఆల్ ఇండియా సైకిల్ టూరిస్టు కుమారి ఆష మాలవీయను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అభినందించారు. సైకిల్ యాత్ర విజయవాడ నుండి జెండా ఊపి ఆయన నేడు ప్రారంభించారు.

ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్రాలలో ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ నగరానికి చేరుకున్న ఆమె సంకల్పం, ధైర్యం స్ఫూర్తిదాయకం అని తెలియజేశారు. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి సైకిల్ యాత్ర వెళుతుంది. దిశా యాప్ డౌన్లోడ్ చేయించడం, మహిళా భద్రత గురించి, మహిళలపై జరిగిన నేరాలకు పడిన శిక్షల గురించి ఆమెకు తెలిపినాట్లు చెప్పారు.

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొంటున్న అన్ని చర్యల గురించి తెలుసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ పర్యటనలోచేసిన కృషి, త్యాగం నిజంగా విశేషమైనది. సైక్లింగ్‌ను రవాణా మార్గంగా ప్రచారం చేయడంతోపాటు మహిళల భద్రతపై అవగాహన కల్పించడంలో మీ అంకితభావం అభినందనీయం అని తెలియజేశారు. అనంతరం ఆష మాలవీయ మాట్లాడుతూ నవంబర్‌ 1న భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించాను.

ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేల కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర పూర్తిచేసాను. మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయి. ఆడపిల్లల చదువుకోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చర్యలు ఆకట్టుకున్నాయి. దిశ యాప్ వల్ల ఆపదలో ఉన్నవారికి క్షణాల్లోనే సాయం అందుతుంది. నేను కూడా దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాను.

దిశ యాప్ లోగో కలిగిన టీ షర్ట్ ధరించి నేను సైకిల్ యాత్ర చేస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి. విశాల్ గున్ని, ఎస్.బి. ఏ.డి.సి.పి. సి.హెచ్. లక్ష్మీపతి, ఏ.ఆర్. ఏ.డి.సి.పి. కే.శ్రీనివాస రావు, ఏ.సి.పి.లు, సి.పి.ఓ. మహిళా సిబ్బంది, మహిళా పోలీస్ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: నేటి రాత్రి నుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

విశాఖ ఉక్కును అమ్మే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

లెస్బియన్ జెండాతో కాళీ మాతను అవమానించేలా వాల్ పోస్టర్

Satyam NEWS

Leave a Comment