విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు, ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటున్నారు. విచిత్రమైన ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండదు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో వద్ద కార్మికులు పెద్ద ఎత్తున డ్యూటీలో చేరేందుకు ముందుకు రాగా యాజమాన్యం వారిని తీసుకునేందుకు నిరాకరించింది. దాంతో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా RTC కార్మికులను బేషరతుగా ఉద్యోగాలకు తీసుకోవాలని హయత్ నగర్ 1&2 డిపోల వద్ద చేరిన కార్మికులు డిపోను ముట్టడించడంతో 13 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఒక్కొక్కటిగా బస్సులు బయటకు వస్తున్నాయి. బర్కత్ పురా డిపో వద్ద పోలిసులు ఓవర్ యాక్షన్ చేశారు. డిపోవద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు తరిమి కొట్టారు. ఈ తోపులాటలో క్రింద పడిపోయి ఒక కార్మికురాలు స్పృహ కోల్పోయింది. ఆర్టీసీ కార్మికురాలు పద్మావతి (కండక్టర్) పోలీసుల దౌర్జన్యానికి స్పృహ కోల్పోయింది. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు. మీడియా పై ఎసిపి జులుం ప్రదర్శించారు. ఫొటోస్ వీడియోస్ తీయకుండా CTC ఎసిపి ప్రదీప్ కుమార్ అడ్డుకున్నారు.
previous post