37.2 C
Hyderabad
May 2, 2024 13: 22 PM
Slider విజయనగరం

క్షేత్ర స్థాయిలో బాధితులకు మహిళా పోలీసులు అండగా నిలవాలి

#depikapatil

విజయనగరంలో పని చేస్తున్న మహిళా  సంరక్షక పోలీసులు (ఎం.ఎస్.పి.)లతో జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో మహిళా పోలీసులతో మమేకమై కేక్ కట్ చేయించి,కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసుశాఖలో మహిళా పోలీసులు (ఎం.ఎస్.పి.)లు జాయిన్ కావడంతో బలోపేతమైందని, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

మహిళలకు రక్షణ చట్టాలు, దిశా యాప్ పట్ల అవగాహన కల్పించడంలోను, మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడంలోను, క్షేత్ర స్థాయిలో ముఖ్య కూడళ్ళు, ప్రార్ధనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలోను, మహిళలపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న వల్లరబుల్ పాయింట్ లను గుర్తించడం, మ్యాపింగు చేయడంలోను క్రియాశీలకంగా పని చేసారన్నారు.

గ్రామ స్థాయిలో మహిళల రక్షణ కొరకు ఒక మహిళ ఉండాలని ప్రభుత్వం ఆలోచించి, ప్రతీ గ్రామం, వార్డులో మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో నియమించిందన్నారు. పోలీసుశాఖలో ఇంకా మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కూడా అధికారులు సమాలోచన చేస్తున్నారని, దీని పై ఉన్నత స్థాయి చర్చ జరుగుతున్నదన్నారు. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి, సంబంధిత పోలీసు అధికారులకు అందించాలన్నారు.

బాధితులకు గ్రామ స్థాయిలో అండగా నిలవాలని, అవసరమైన వారికి కౌన్సిలింగు నిర్వహించి, సహాయ, సహకారాలను అందించాలన్నారు. అదే విధంగా మహిళలపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలకు పై నిఘా ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాల్లో అనుమానస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే, సమాచారాన్ని పోలీసు అధికారులకు అందిస్తే, ఎటువంటి నేరాలు జరగకుండా గస్తీ చేపట్టే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.

మహిళా పోలీసులు ప్రజలకు, పోలీసుశాఖకు మధ్య వారధిగా పని చేసి, పోలీసుశాఖకు మంచి పేరును తీసుకొని వచ్చి, ప్రతిష్టను పెంచే విధంగా సమిష్టిగా పని చేయాలన్నారు. అదే విధంగా విధి నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వస్తే, పరిష్కరించేందుకు చర్యలు చేపడతాని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. మహిళా పోలీసులు మాట్లాడుతూ పోలీసుశాఖతో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించడంలో పోలీసు అధికారులు తమకు అందిస్తున్న సహాయ, సహకారాలకు జిల్లా ఎస్పీకి మరియు ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సత్యన్నారాయణరావు, అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, ఎస్బీ సీఐలు జి. రాంబాబు, ఎన్. శ్రీనివాసరావు, డీసీఆర్ బి సీఐ డా. బి.వెంకటరావు, వన్ టౌన్ సీఐ జే.మురళి,టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేణి, ఎస్ఐలు దుర్గా ప్రసాద్, అశోక్ కుమార్, విజయకుమార్, నారాయణరావు, నసీమా బేగం, రవి, మహిళా పోలీసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో జూపల్లి వర్గీయుల నూతన సంవత్సర వేడుకలు

Satyam NEWS

వీడ్కోలు

Satyam NEWS

తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

Bhavani

Leave a Comment