26.7 C
Hyderabad
May 3, 2024 07: 49 AM
Slider నల్గొండ

పోలీసుల సమస్యలు పరిష్కరించాలి

#SPRanganath

పోలీస్ శాఖలో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిఐజి, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ కు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు.

సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో డిఐజి రంగనాధ్ ను కలిసి పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా చేయూత పథకం నిధులను మూడు జిల్లాలకు విభజించి జిల్లాల వాటా ఇవ్వాలని కోరారు.

అనారోగ్యంతో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలలో ఒకరికి మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను కారుణ్య నియామకం ద్వారా పోలీస్ మృతుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు.

అదే విధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్డర్ టూ సర్వ్ కింద పనిచేస్తున్న నల్లగొండ జిల్లా ఎ.ఆర్. కానిస్టేబుల్స్ స్వంత జిల్లాకు బదిలీ చేసి వారి స్థానంలో అక్టోబర్ నెలలో నియామకం అవుతున్న కానిస్టేబుల్స్ ను రాచకొండకు బదిలీ చేయాలని కోరారు.

నల్లగొండ నుండి సూర్యాపేటకు, సూర్యాపేట నుండి నల్లగొండ జిల్లాకు బదిలీలు కోరుతున్న కానిస్టేబుల్స్ బదిలీలు చేయడంతో పాటు వారి స్థానంలో అక్టోబర్ నెలలో నియామకం కానున్న కానిస్టేబుల్స్ తో భర్తీ చేయాలని డిఐజి రంగనాధ్ ను కోరారు.

వీటితో పాటు 29 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ ను సినియర్లుగా గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించాలని, ఉమ్మడి జిల్లా హోమ్ గార్డులను రాచకొండ కమిషనరేట్, సూర్యాపేట నుండి నల్లగొండకు బదిలీ చేయాలని కోరారు.

పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డితో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల అధ్యక్షులు బి. రామచందర్ గౌడ్, బి. జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, జంగయ్య, జహంగీర్, శ్రీను, చంద్రశేఖర్, కృష్ణ, కార్తీక్ తదితరులున్నారు.

Related posts

మానసిక వేదన అనుభవిస్తున్న ప్రభుత్వ వైద్యులు

Satyam NEWS

ప్రత్యేక హోదా కోసం కాలర్ పట్టుకుంటామని చెప్పి … కాళ్లు పట్టుకున్నారు

Bhavani

సీబీఐ కోర్టుకు జగన్ మళ్లీ ఎప్పుడు రావాలి?

Satyam NEWS

Leave a Comment